‘మిస్టర్ మజ్ను’ మూవీ రివ్యూ : రొటీన్ లవ్ స్టోరీ

Mr Majnu Movie Review

‘మిస్టర్ మజ్ను’ మూవీ రివ్యూ రేటింగ్ : 2.75/5.0

విడుదల తేదీ : జనవరి 25, 2019

నటీనటులు : అఖిల్, నిధి అగర్వాల్, నాగబాబు, వి జయప్రకాష్ , సితార తదితరులు.

దర్శకత్వం : వెంకీ అట్లూరి

నిర్మాత : బివిఎస్ఎన్ ప్రసాద్

సంగీతం : ఎస్ తమన్

ఎడిటర్ : నవీన్ నూలి

మజ్ను కోసం యంగ్ టైగర్ ఎన్టీఆర్

తొలి సినిమాతోనే అక్కినేని అభిమానులను తీవ్రంగా నిరాశపరిచిన అఖిల్‌, రెండో సినిమా ‘హలో’ తో కాస్త పరవాలేదనిపించుకున్నాడు. అయితే తన మీద ఉన్న అంచనాలను మాత్రం అందుకోలేకపోయాడు. దీంతో మూడో సినిమాగా తన వయసుకు తగ్గ రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.తొలిప్రేమ సినిమాతో సూపర్‌ హిట్ అందుకున్న వెంకీ అట్లూరి,ఈ సినిమాలో అఖిల్‌ ను ప్లేబాయ్‌గా చూపించాడు.ఈ చిత్రం ఈ రోజే విడుదల అయింది. మరి ప్రేక్షకులును ఏ మేరకు మెప్పించిందో చూద్దామా!.

కథ :

విక్రమ్‌ కృష్ణ అలియాస్‌ విక్కీ (అఖిల్ అక్కినేని) లండన్‌ లో ప్లేబాయ్‌ లా అమ్మాయిలతో సరదాగా గడుపుతూ ఎంజాయ్ చేస్తుంటాడు. అమ్మాయిల విషయంలో ఎలా ఉన్నా విక్కీ వ్యక్తిత్వం నచ్చి నిఖిత అలియాస్ నిక్కీ (నిధి అగర్వాల్‌) అతడిని ఇష్టపడుతుంది.కానీ విక్కీ మాత్రం అలాంటి సిన్సియర్ లవ్ నా వల్ల కాదు అంటూనే ఆమెతో ప్రేమలో పడతాడు.ఆ తర్వాత జరిగే కొన్ని అనుకోని సంఘటనల కారణంగా నిక్కీ విక్కీ ఇద్దరు విడిపోతారు.దూరమైన ప్రేమ కోసం విక్కీ ఏం చేశాడు? తిరిగి ఇద్దరు ఎలా కలుసుకున్నారు? అన్నదే మిగతా కథ.

నటీనటులు:

అఖిల్ తన వయసుకు తగ్గ పాత్రలో ఆకట్టుకున్నాడు.ముఖ్యంగా ఫస్ట్ హాఫ్లో ప్లేబాయ్‌ తరహా పాత్రలో పర్ఫెక్ట్‌ గా సూట్‌ అయ్యాడు.ముఖ్యంగా తన బాడీ లాంగ్వేజ్, తన మాడ్యులేషన్ విషయంలో అఖిల్ పెట్టిన ఎఫెక్ట్స్ చాలా బాగున్నాయి.గత సినిమాల్లో కంటే ఈ సినిమాలో కొత్త లుక్ తో ఫ్రెష్ గా కనిపించాడు. తన నటనతో అక్కడక్కడా నవ్వించే ప్రయత్నం చేస్తూనే, ఇటు సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ తో హీరోగా తన పాత్రకి పూర్తి న్యాయం చేశాడు.నిఖిత పాత్రలో నిధి అగర్వాల్ ఒదిగిపోయింది. అందంతో పాటు అభినయంతోనూ ఆకట్టుకుంది.ముఖ్యంగా ఎమోషనల్ సన్నివేశాల్లో మరియు ప్రేమ సన్నివేశాల్లో ఆమె చాలా బాగా నటించింది. తెర మీద చాలా పాత్రలు కనిపించినా ఎవరికి పెద్దగా స్కోప్‌ లేదు. సితార, పవిత్ర లోకేష్, నాగబాబు, జయప్రకాష్, రావూ రమేష్‌ ఫ్యామిలీ ఎమోషన్స్‌తో ఆకట్టుకోగా సుబ్బారాజు, ప్రియదర్శి, హైపర్‌ ఆది కామెడీతో మెప్పించే ప్రయత్నం చేశారు.

విశ్లేషణ:

వెంకీ అట్లూరి తొలి సినిమా ‘తొలి ప్రేమ’లో ఒక మంచి ప్రేమకథకు అవసరమైన అన్ని లక్షణాలూ కనిపిస్తాయి. ముఖ్యంగా ప్రేమకథకు అతి ముఖ్యమైన ‘ఫీల్’ తీసుకురావడంలో అది విజయవంతమైంది.ఇక ‘మిస్టర్ మజ్ను’ విషయానికి వస్తే ప్లే బాయ్ పాత్రకు సంబంధించి మంచి స్టోరీ లైన్ ను తీసుకున్నారు కానీ, ఆ లైన్ ను పూర్తి స్థాయిలో ఆకట్టుకునే విధంగా కథా కథనాన్ని మాత్రం రాసుకోలేదు. హీరో, హీరోయిన్ ల మధ్యన వచ్చే ప్రేమ తాలూకు సన్నివేశాలు కూడా పూర్తిగా ఆకట్టుకున్నే విధంగా ఉండవు.హీరో కూడా ఈజీగా హీరోయిన్ తో ప్రేమలో దిగిపోతాడు. ఇద్దరూ కలవడానికీ పెద్ద కారణాలు కనిపించవు. అలాగే విడిపోవడానికి దారి తీసిన పరిస్థితులు కూడా ఫోర్స్డ్ గా అనిపిస్తాయి.ముఖ్యంగా క్లైమాక్స్‌ అంత కన్విన్సింగ్‌గా అనిపించదు. రచయితగా మాత్రం వెంకీ తన మార్క్‌ చూపించాడు. చాలా డైలాగ్స్‌ గుర్తుండిపోయేలా ఉన్నాయి. జార్జ్‌ సీ విలియమ్స్ సినిమాటోగ్రఫి సినిమాకు మేజర్‌ ప్లస్‌ పాయింట్. హీరో హీరోయిన్లతో పాటు లండన్‌ అందాలను కూడా చాలా బాగా చూపించాడు. తమన్‌ అందించిన పాటలు, నేపథ్య సంగీతం బాగున్నాయి. ఎడిటింగ్‌, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.