టీజర్:మజ్నులా కనిపిస్తున్న అఖిల్

అఖిల్ హీరోగా నటిస్తున్న ‘మిస్టర్ మజ్ను’ సినిమాకు వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్నాడు.‘తొలి ప్రేమ’ తో మంచి విజయాన్ని సాధించిన వెంకీ, అఖిల్‌ కి తగ్గట్టుగా కథను సిద్ధం చేశారు.

ఆకట్టుకుంటున్న అఖిల్ సిక్స్ ప్యాక్ ఫోటో

అఖిల్ ఈ చిత్రంతో తప్పకుండా హిట్ అందుకుంటాడనే అంచనాల్లో చిత్ర యూనిట్ ఉంది.ఈ చిత్రంలో అఖిల సరసన నిధి అగర్వాల్ నటిస్తుండగా,ఎస్.ఎస్.థమన్ సంగీతం అందిస్తున్నారు.

తాజాగా ఈ చిత్రబృందం టీజర్ ను విడుదల చేశారు.ఇక టీజర్ విషయానికొస్తే, ‘అర్ధరాత్రి దానింట్లో అదేం పని’ అంటూ మొదలవుతుంది. స్ట్రెస్ లో ఉంటే చాక్ లెట్ తింటే సరిపోదు,హ్యూమన్ టచింగ్ అవసరమని అఖిల్ బోల్డ్ గా చెప్పేస్తాడు.అలా అమ్మాయిలతో ఆకతాయిగా తిరుగుతున్న అఖిల్ కు ట్రెడిషనల్ గా ఉన్న నిధి అగర్వాల్ కనిపిస్తుంది.ఎలాగైనా నిధిని ప్రేమలో పడేయాలని వెంట పడుతుంటాడు.చివరికి అఖిల్ నిధి ప్రేమను గెలుసుకుంటాడా లేదా ? అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా టీజర్ చూడండి.