మరో క్రేజి మల్టీస్టారర్ తో కమల్ వెంకీ !

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రంలో సూపర్ స్టార్ మహేష్ బాబు , ఫ్యామిలీ హీరో విక్టరీ వెంకటేష్‌ ని కలిపి సరికొత్త ట్రెండ్ సృష్టించిన డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల.

మజ్ను కోసం యంగ్ టైగర్ ఎన్టీఆర్

Multi-Starrer-movie-with-kamal-Venkatesh

ఆ తరువాత ముకుంద , బ్రహ్మోత్సవం చిత్రాలతో పరాజయాలను చవిచూశాడు. బ్రహ్మోత్సవం చిత్రం తరువాత దాదాపుగా మూడు సంవత్సరాల గ్యాప్ తీసుకొన్న ఈ డైరెక్టర్ తాజాగా మరో క్రేజి మల్టీస్టారర్ సినిమా చేయబోతున్నట్లు ఫిలిం సర్కిల్లో వార్తలు వినిపిస్తున్నాయి.

ఇక ఈ చిత్రంలో కమల్‌ హాసన్‌, వెంకటేశ్‌ కలిసి నటించబోతున్నట్లు సమాచారం.అంతే కాదు ఈ సినిమాకు ‘కూచిపూడి వారి వీధి’ అనే టైటిల్ అనుకుంటున్నట్లు తెలుస్తుంది.

ఇదివరకే ‘ఈనాడు’ చిత్రంతో ఒకే తెరపైన అలరించిన వెంకీ కమల్ మరో సారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.గీత ఆర్ట్స్ బ్యానర్ లో తెరకెక్కనున్న ఈ చిత్రం పై అధికారిక ప్రకటన వెలుబడనుంది. 

Advertisement