క్రేజీ దర్శకుడితో బన్నీ!

Murugadoss Directs Allu Arjunహిట్ ఫ్లాప్‌ లతో సంబంధం లేకుండా, భారీ వసూళ్లు సాధించే స్టామినా ఉన్న హీరో అల్లు అర్జున్‌.ప్రస్తుతం త్రివిక్రమ్‌ దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమా కోసం బన్నీ కసరత్తులు చేస్తున్నాడు.ఈ సినిమా షూటింగ్ మార్చిలో ప్రారంభం కానుంది.

కేరళలో బన్నీ ఫాలోయింగ్ చూశారా?

ఈ సినిమాతో పాటు బన్నీ మరో రెండు సినిమాలకు ఓకె చెప్పినట్టుగా తెలుస్తోంది.చాలా రోజులుగా ప్రచారం జరుగుతున్నట్టుగా విక్రమ్‌ కే కుమార్ దర్శకత్వంలో బన్నీ ఓ సినిమా చేయనున్నాడట.

అలాగే తమిళ స్టార్ డైరెక్టర్‌ మురుగదాస్‌ దర్శకత్వంలోనూ ఓ సినిమా చేసేందుకు బన్నీ ఓకె చెప్పినట్టుగా తెలుస్తోంది.ఈ సినిమాను గీతా ఆర్ట్స్‌ బ్యానర్‌ లో నిర్మించనున్నారట.అంతేకాదు ఈ ప్రాజెక్ట్‌ను 2019 చివర్లో ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నారట.

వీరితో పాటు మరో కొత్త దర్శకుడితోనూ బన్నీ సినిమా చేసే ఆలోచనలో ఉన్నాడట.అందుకోసం కొత్త దర్శకులు చెప్పే కథలు వింటున్నారట.చాలాకాలం గ్యాప్ తీసుకున్న బన్నీ,ఇక వరుసగా సినిమాలు చేయనున్నారట.

Advertisement