పుట్టగొడుగుల్లో సహజ పోషకాలు ఎక్కువగా ఉంటాయి. శాకాహారమైన ఈ పుట్టగొడుగుల్లో పోషకాలు మెండుగా ఉంటాయి. మాంసంహారం తినని వాళ్లు పుట్టగొడుగులను తప్పనిసరిగా తమ డైట్ లో చేర్చుకోవడం చాలా మంచిది. వీటి ద్వారా మాంసాహారం ద్వారా పొందే ప్రయోజనాలన్నీ ఈజీగా పొందవచ్చు. శరీరానికి కావాల్సిన మాంసకృతులు పుట్టగొడుగుల ద్వారా శరీరానికి లభిస్తాయి. అంతేకాదు పుట్టగొడుగుల్లో పలు రకాల దీర్ఘకాలిక వ్యాధులు నయం చేసే సత్తా కూడా దాగుంది. ఇప్పుడు ఈ పుట్టగొడుగుల వేపుడు ఎలా తాయారు చేసుకోవాలో చూద్దాం.
కావలసిన పదార్థాలు:
పుట్టగొడుగుల ముక్కలు – 1 కప్పు,
ఉల్లిపాయ ముక్కలు – 1/2 కప్పు,
పచ్చిమిర్చి – 4 ,
అల్లం వెల్లుల్లి ముద్ద – 1 టీ స్పూను,
మిరియాల పొడి – 1 టీ స్పూను,
కొత్తిమీర – 1/2 కప్పు,
ఉప్పు- రుచికి తగినంత,
పసుపు – చిటికెడు,
నిమ్మరసం – 1 టీ స్పూను ,
గరం మసాలా -1 టీ స్పూను ,
నూనె – 2 టీ స్పూనులు.
తయారుచేసే విధానం:
ముందుగా పుట్టగొడుగులను ముక్కులు గా కోసి ఉప్పు కలిపిన వేడినీటిలో అరగంట సేపు నానబెట్టాలి. తరువాత స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టి వేడైన తరువాత 2 టీ స్పూనుల నూనె వేసుకొని అందులో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, అల్లంవెల్లుల్లి ముద్ద వేసి దోరగా వేగించాలి. ఆ తరువాత పుట్టగొడుగుల ముక్కలు, మిరియాల పొడి, ఉప్పు, పసుపు మరియు గరం మసాలా కూడా మరియు గరం మసాలా కూడా వేసి బాగా వేయించుకోవాలి. చివర్లో నిమ్మరసం ,కొత్తిమీర వేసి రెండు నిమిషాల తర్వాత దించేయాలి.