అల్లు అర్జున్ సినిమాని అడ్డుకున్నవెస్ట్ బెంగాల్ సీఎం!

అల్లు అర్జున్,అనుఇమ్మాన్యుయేల్ జంటగా వక్కంతం వంశి దర్శకుడిగా పరిచయం అవుతూ తెరకెక్కుతున్న చిత్రం నాపేరు సూర్య -నా ఇల్లు ఇండియా . కె.నాగబాబు సమర్పణలో,రామలక్ష్మి సినీ క్రియేషన్స్ బ్యానర్లో శ్రీధర్ నిర్మాతగా,బన్నీ వాసు నిర్మాతగా ఈ చిత్రం నిర్మిస్తున్నారు . ఈచిత్రంలో యాక్షన్ కింగ్ అర్జున్, శరత్ కుమార్ లు ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు.

ఈ చిత్రానికి సంబందించిన షూటింగ్ భారత సరిహద్దులో …. అదికూడా మైనస్ 12 డిగ్రీల సెల్సియస్ వుండే డార్జీలింగ్ లో జరుగుతుంది. ఒరిజనల్ గా మనసైనికులు దేశంకోసం ఎలా పోరాడుతారో … హీరో అల్లుఅర్జున్ సైతం …. సినిమా మీదున్న భక్తితో…. ఒరిజినల్ లొకేషన్స్ లో షూటింగ్ కు వాతావరణం అనుకూలంగా లేకపోయినా …. సహజత్వం కోసం షూటింగ్ చేస్తున్నారు. ఈ లోగా పోలీసులు 4రోజులు షూటింగ్ నిలిపివేయమని ఆదేశించారు. సీఎం మమతా బెనర్జీ పర్యటన డార్జీలింగ్ లో వుంది. దీంతో చేసేదేమీ లేక షూటింగ్ ఆపేశారు దర్శక నిర్మాతలు. 4రోజులు ఏంచేయాలో తెలియక,అక్కడే మకాం వేసి డార్జీలింగ్ సహజ అందాలను చూసి ఆనందిస్తున్నారు.

Allu Arjun Hair Style in NPS 2

బాలీవుడ్ సంగీత ద్వయం విశాల్ – శేఖర్ ఈ చిత్రానికి అద్భుతమైన సంగీతం అందిస్తున్నారు. మరో వైపు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా శరవేగంగా జరుగుతున్నాయి .అన్ని కార్యక్రమాలు తొందరగా పూర్తిచేసి సినిమాను 2018,ఏప్రిల్ 27న విడుదల చేయడానికి సిద్ధమవుతోంది టీమ్.

Advertisement