నాగ్-చైతూ కాంబోలో బంగార్రాజు

గత ఏడాదిలో విడుదలైన ‘సోగ్గాడే చిన్నినాయ‌న‌’ చిత్రం సూపర్ హిట్ సక్సెస్ ని అందుకున్న సంగతి తెలిసిందే . అయితే ఈ చిత్రానికి సీక్వెల్ రాబోతుంది.

అనుష్క పారితోషకం అంతేనట

ఇక సోగ్గాడే చిన్నినాయ‌న‌ చిత్రంలో నాగార్జున పేరు బంగార్రాజు. కథలో ఈ పాత్ర కీలకం కావడంతో ఇప్పుడు ఈ సీక్వెల్ కి బంగార్రాజు అనే టైటిల్ న‌మోదు చేశారు.

అన్నపూర్ణ స్టూడియోస్ సంస్థ ఈ టైటిల్‌ని రిజిస్టర్ చేయించింది.దాదాపు ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తయిందట . ఇక ఈ చిత్రం లో నాగ్ సరసన రమ్య కృష్ణ నటించనున్నట్లు తెలుస్తుంది.

ఇక తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం లో అక్కినేని వారసుడు నాగ చైతన్య కూడా కనిపించనున్నాడట.
రియల్ లైఫ్ లో తండ్రికొడుకులైన నాగార్జున, నాగచైతన్య ఈ సినిమాలో మాత్రం తాత-మనవడు పాత్రల్లో కనిపించబోతున్నారు.

కళ్యాణ్ కృష్ణ ఈ మేరకు కథలో చేయాల్సిన మార్పులన్నీ చేశాడు. అన్నపూర్ణ స్టుడియోస్ బ్యానర్ పై నాగార్జున నిర్మించనున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారట.

Advertisement