జనసేన నుంచి ఎంపీ అభ్యర్థిగా నాగబాబు

మొదటి నుంచి మెగాబ్రదర్ నాగబాబు పరోక్షంగా జనసేనకు మద్దతు ఇస్తూ వస్తున్నారు, కానీ ప్రత్యేక్షంగా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనలేదు.అయితే పార్టీ నుండి ఎటువంటి అఫీషియల్ అప్డేట్ రాకపోవటంతో ఆ వార్తలను రూమర్లు గానే భావించారు.

వైసీపీలో చేరనున్న డీఎల్‌ రవీంద్రారెడ్డి

తాజాగా నాగబాబు జనసేన పార్టీలో చేరారు.నర్సాపురం లోక్‌సభ అభ్యర్థిగా ఆ పార్టీ తరపున నాగబాబు బరిలోకి దిగుతున్నారు . ఈ విషయాన్ని జనసేన పార్టీ అధికారికంగా ప్రకటించింది. దీంతో జనసేనకు మెగా ఫ్యామిలీ నుండి బలం చేకూరినట్లే అయ్యింది.

ఇక జనసైనికుల్లో మెగా అభిమానుల్లో నూతన ఉత్సాహం నెలకొనటం ఖాయం. దీనికి మెగా హీరోలు రామ్ చరణ్, సాయిధరమ్ తేజ్, వరుణ్ తేజ్ లు ఎన్నికల ప్రచారానికి రానున్నారని ఇటీవలే వార్తలొచ్చాయి.

ఇదిలా ఉండగా నాగబాబు ప్రత్యక్ష రాజకీయాల్లో లేనప్పటికీ జనసేన ఆవిర్భావం నుండి ఆ పార్టీకి మద్దతిస్తూ అభిమాన సంఘాలతో భేటీ అవుతూ పార్టీ కార్యకలాపాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఎట్టికేలకు ఎన్నికల సమయంలో నాగబాబు పార్టీలో చేరి​ లోక్‌సభ అభ్యర్థిగా బరిలోకి దిగారు.