ప్రిస్టేజియస్ బ్యానర్ లో చైతుకి ఛాన్స్

 పెళ్లి తర్వాత అక్కినేని నాగ చైతన్య, సమంత కలిసి నటించిన మొదటి చిత్రం ‘మజిలీ’ తో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ చిత్రానికి శివ నిర్వాణ దర్శకత్వం వహించాడు.

బిసినెస్ రంగంలోకి మరో స్టార్

ఇక తాజాగా విక్టరీ వెంకటేష్ తో కలిసి నటిస్తున్న మల్టీస్టారర్ చిత్రం ‘వెంకీ మామ’ షూటింగ్ లో పాల్గొంటున్నాడు చైతు.ఈ రెండు చిత్రాలు సెట్స్ మీద ఉండగానే చైతు మరో ప్రిస్టేజియస్ బ్యానర్ లో సినిమాకి ఛాన్స్ దక్కించుకున్నాడని సమాచారం.

మేర్లపాక గాంధీ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ లో చైతు సినిమా చేయబోతున్నాడు.డిసెంబర్ లో ఈ సినిమా మొదలు కాబోతుంది.

అలాగే చైతు కోసం స్టార్ రైటర్ విజయేంద్ర ప్రసాద్ పాత ‘దేవదాస్’ కథ ఆధారంగా అంతటి గొప్ప విషాదాంతమైన లవ్ స్టోరీని రాస్తున్నాడట. ఇక ఈ చిత్రానికి ఎవరు దర్శకత్వం వహిస్తారో ఇంకా తెలియాల్సి ఉంది.

Advertisement