బన్నీ కోసం బాలీవుడ్ విలన్

త్రివిక్రమ్ డైరెక్షన్ లో అల్లు అర్జున్ హీరో గా ఒక సినిమా తెరకెక్కనుంది అనే విషయం మనకు తెలిసిందే.ఈ సినిమా మరికొద్ది రోజుల్లో సెట్స్ పైకి వెళ్లబోతుందని చిత్ర యూనిట్ చెపుతున్నారు.

నెగటివ్ రోల్ లో మిల్కీ బ్యూటీ …!

బన్నీ మేకోవర్ కారణంగా సెట్స్ పైకి వెళ్లడం ఆలస్యం అయ్యిందని అంటున్నారు. ప్రస్తుతం త్రివిక్రమ్ కాస్ట్ & క్రూ ఎంపికలో బిజీ గా ఉన్నారట.ఇక ఈ సినిమా లో ఇద్దరు హీరోయిన్స్ ఉంటుండగా , రెండవ హీరోయిన్ గా ఈషా రెబ్బ ని పెట్టాలని ప్లాన్ చేస్తున్నారు .

తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా లో విలన్ రోల్ లో నటించేందుకు బాలీవుడ్ యాక్టర్ నానా పటేకర్ అయితే బాగుంటుందని అనుకుంటున్నారట. ఈమద్యే ‘కాల’ సినిమాలో ప్రతినాయకుడి పాత్రలో కనిపించిన నానా పటేకర్ ఇప్పటివరకు తెలుగు సినిమాలు చేయలేదు.

ఈ విషయం పై నానా పటేకర్ ఇంకా ఎలాంటి సమాధానాన్ని ఇవ్వలేదు .త్వరలోనే దీనిపై ఓ క్లారిటీ రానుంది.