‘జెర్సీ’ లో నాని ఇలా..

Nani in Jerseyవెరైటీ స్టోరీలను ఎంచుకుంటూ తెలుగు సినిమా ప్రేక్షకులను అలరిస్తున్న నాని,ప్రస్తుతం ‘జెర్సీ’ అనే సినిమాలో నటిస్తున్నాడు.వేసవి కానుకగా విడుదల కాబోతున్న ఈ సినిమాలో నాని క్రికెటర్ గా అలరించబోతున్నాడు.

సితార డాన్స్ కు ఫిదా అంటున్న మహేష్!

గతంలో కబాడి ఆటగాడిగా భీమిలి సినిమాలో నటించిన నాని, తాజాగా క్రికెటర్ అవతారం ఎత్తడంతో ఆయన అభిమానులు ఈ సినిమా పై అంచనాలు బీభత్సంగా పెట్టుకున్నారు.

తాజాగా ఈ సినిమాకి సంబందించిన ఒక వార్త టాలీవుడ్ ఇండస్ట్రీ లో చక్కర్లు కొడుతుంది.ఈ సినిమాలో నాని చనిపోతున్నట్లు, అది కూడా గ్రౌండ్లోనే అనే టాక్ ఇండస్ట్రీలో వినబడుతుంది.నిజానికి ఈ సినిమా 38 ఏళ్ళ వయసులో గ్రౌండ్ లోనే ప్రాణాలు వదిలిన రమణ్ లాంబా అనే క్రికెటర్ కథ ఆధారంగా రూపొందుతుందట.