‘మా’ ఎన్నికల పోరులో గెలుపు నరేష్‌దే !

Naresn Won In MAA Elections 2019‘మా'(మూవీ ఆర్టిస్ట్స్‌ అసోషియేషన్‌) అధ్యక్షుడు ఎవరనే ఉత్కంఠ నడుమ ఎన్నికల ఫలితాల వచ్చాయి.’మా’ ఎన్నికల్లో సీనియర్‌ నటుడు నరేష్‌ అసోసియేషన్ ప్రెసిడెంట్‌గా విజయం సాధించారు. 

తెలుగుదేశం పార్టీ అంతమే తన ధ్యేయం:డీఎల్‌

ప్రత్యర్థి శివాజీ రాజా పై 69 ఓట్ల తేడాతో నరేష్ గెలుపొందారు.ఆయనతో పాటు ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్‌గా హీరో శ్రీకాంత్‌పై రాజశేఖర్ గెలుపొందారు. జనరల్ సెక్రటరీగా రఘబాబుపై జీవిత గెలుపొందారు.

జాయింట్ సెక్రటరీగా గౌతమ్ రాజు, శివబాలాజీ విజయం సాధించారు. సుమారు 800 మంది ఆర్టిస్ట్‌లు మూవీ ‘మా’ అసోసియేషన్‌లో ఉండగా.. రికార్డు స్థాయిలో 472 ఓట్లు నమోదు అయ్యాయి.

గత ఎన్నికల్లో శివాజీరాజా ప్యానల్‌ నుండి ఈసీ మెంబర్‌గా పోటీ చేసిన నటి హేమ.. ఈసారి ఉపాధ్యక్షురాలి పదవికి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలవడం విశేషం.
 

Advertisement