త్వరలో ఏపీకి కొత్త గవర్న‌ర్‌…?


ఉమ్మడి తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ పదవీ కాలం చాలా కాలం క్రితమే ముగిసినప్పటికీ, తదుపరి ఉత్తర్వులు వచ్చేంత వరకూ ఆయనే రెండు రాష్ట్రాలకూ గవర్నర్‌గా కొనసాగుతారని కేంద్రం ఉత్తర్వులు జారీ చేయడం తెలిసిందే.

చంద్రబాబు కి చుక్కలు చూపించనున్న మోదీ సర్కార్

రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారిగా ద్వివేదిని నియమించిన నేపథ్యంలో గవర్నర్ నియామకం పై కేంద్రం వ్యూహాత్మకంగా వ్యవహరించనున్నట్లు తెలుస్తోంది.

ఏపీలో ఎన్నిక‌లు స‌మీపిస్తుండ‌టంతో రాజ‌కీయాలను మ‌రింత వేడెక్కించేలా కేంద్రం అడుగులు వేస్తోంది.

త్వరలో ఏపీకి కొత్త గవర్న‌ర్‌ను నియ‌మించేందుకు కేంద్రం సిద్ధ‌మ‌వుతున్న‌ట్లు తెలుస్తోంది.
మారిన రాజ‌కీయ స‌మీక‌ర‌ణాల నేప‌థ్యంలో, ఏపీకి ప్ర‌త్యేక గ‌వ‌ర్న‌ర్ నియామ‌కం పై కేంద్ర ప‌రిశీలిస్తున్న‌ట్లు చెప్తున్నారు.

ఈ క్ర‌మంలో ప్రస్తుతం పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్‌గా వ్యవహరిస్తున్న కిరణ్‌బేడీని ఏపీ గవర్నర్‌గా నియమించనున్నట్లు ప్రచారం జరుగుతోంది.

అయితే, దీని పై పార్ల‌మెంటు బ‌డ్జెట్ స‌మావేశాల నాటికి ఓ స్ప‌ష్ట‌త వ‌స్తుంద‌ని రాజకీయ విశ్లేషకుల నుండి వస్తున్న సమాచారం.

Advertisement