వైసీపీ లోకి కొనసాగుతున్న వలసల జోరు

New-Joinings-Continues-In-YCP

ఏపీలో ప్రతిపక్ష పార్టీ అయిన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలోకి వలసల జోరు కొనసాగుతోంది.
పారిశ్రామికవేత్త, టీడీపీ వ్యవస్థాపక సభ్యుడు దాసరి జైరమేష్, మాజీ మంత్రి దాడి వీరభద్రరావు, ఆయన తనయుడు రత్నాకర్, టీడీపీకి చెందిన మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి,మాజీ ఎమ్మెల్యే అడుసుమిల్లి జయప్రకాష్, ఏపీ ఇరిగేషన్‌ డెవలప్‌మెంట్‌ మాజీ అధ్యక్షుడు బుక్కచర్ల నల్లప్పరెడ్డి, పీసీసీ అధికార ప్రతినిధి సతీష్‌వర్మతోపాటుగా అనంతపురం, విశాఖపట్నం జిల్లాలకు చెందిన పలువురు నేతలు వైఎస్సార్‌సీపీలో చేరారు.

వచ్చే ఎన్నికల్లో వైసీపీ విజయం ఖాయం:మిథున్‌రెడ్డి

వైసీపీ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వారికి కండువాను కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.నేతల చేరికల నేపథ్యంలో తరలివచ్చిన వారి అనుచరగణంతో హైదరాబాద్‌లోని పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నివాస పరిసరాలు కిటకిటలాడాయి.

ఈ సందర్భంగా మోదుగుల మీడియాతో మాట్లాడుతూ సీఎం… చంద్రబాబు పై ప్రజలకు పూర్తిగా నమ్మకం పోయిందని, ఇక ఆయనేం చెప్పినా నమ్మే పరిస్థితులు లేవని అన్నారు.ఎంపీ గల్లా జయదేవ్‌ తనపైన మాట్లాడాల్సిన మాటలు కాదని, టీడీపీలో ఉన్నప్పుడు ఎందుకు తనపై విమర్శలు చేయలేదని ప్రశ్నించారు.

టీడీపీ హయాంలో ప్రజలకు ఎలాంటి న్యాయం జరగట్లేదని తెలిసి వైఎస్సార్‌సీపీలో చేరానన్నారు.
గుంటూరు జిల్లాలో టీడీపీని లేకుండా చేస్తానన్నారు.నాలుగేళ్ల తర్వాత వైఎస్సార్‌సీపీలోకి రావడం సొంతగృహానికి వచ్చినట్టుగా ఉందని దాడి వీరభద్రరావు అన్నారు.

జగన్‌ నాయకత్వంలో పనిచేస్తున్నందుకు సంతోషంగా ఉందని, ఆయన ముఖ్యమంత్రి కావడం చారిత్రక అవసరమని పేర్కొన్నారు.

Advertisement