జనసేన పార్టీలోకి బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్యే…

ఆకుల సత్యనారాయణ తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం అర్బన్‌ ఎమ్మెల్యేగా ఉన్నారు.గత కొంత కాలంగా ఆకుల సత్యనారాయణ బీజేపీ ని వీడతారని ప్రచారం జరుగుతోంది.

ప్రజా నాయకుడు ఎవరు ?

జనసేన లోకి చేరికలు మొదలు రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ బీజేపీ పార్టీకి గుడ్ బై చెప్పి జనసేన కండువా కప్పుకునేందుకు సిద్దమైనట్లు తెలుస్తుంది.

2014 ఎన్నికల్లో బీజేపీ తరఫున రాజమండ్రి సిటీ ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆయన ఈనెల 21న ఆయన జనసేన పార్టీలో చేరనున్నారు.

ఆయన భార్య లక్ష్మీ పద్మావతి ఎప్పటి నుండో పవన్ కు వీరాభిమాని, ఇటీవల జనసేన పార్టీకి సంబంధించిన కార్యక్రమాల్లో ఆమె చురుగ్గా పాల్గొంటున్నారు.

అంతే కాదు ఉద్దానం కిడ్నీ బాధితులను ఆదుకోవాలంటూ శ్రీకాకుళంలో జనసేనాని చేసిన దీక్షకు మద్దతుగా రాజమండ్రి సబ్‌కలెక్టర్‌ ఆఫీసు వద్ద పద్మావతి దీక్ష కూడా చేపట్టారు.

పవన్ కళ్యాణ్ ఆహ్వానం మేరకు జనసేన పార్టీలో చేరుతున్నట్టు చెప్పారు. సత్యనారాయణకు రాజమహేంద్రవరం పార్లమెంట్‌ స్థానం ఇవ్వడానికి పవన్ కళ్యాణ్ ఓకే చెప్పాడని వార్తలు వినిపిస్తున్నాయి.

జనసేన పార్టీలో చేరే ముందు బీజేపీ ప్రాథమిక సభ్యత్వానికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని చెప్పారు. జనవరి 21న ఆకుల సత్యనారాయణ అధికారికంగా జనసేనలో చేరతారని సమాచారం.

Advertisement