మజిలీ చిత్రం నుండి ‘ప్రియతమా ప్రియతమా’ సాంగ్

New Movie Update From Majili‘నిన్నుకోరి’ ఫేమ్ శివ నిర్వాణ దర్శకత్వంలో అక్కినేని నాగ చైతన్య సమంత జంటగా కలిసి నటిస్తున్న చిత్రం మజిలీ . పెళ్లి తరువాత వీరిద్దరూ నటిస్తున్న మొదటి చిత్రం కావడంతో ఈ చిత్రం పై భారీ అంచనాలు ఉన్నాయి.

లీకైన మహర్షి మూవీ పిక్స్

రీసెంట్ గా షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలు పెట్టుకుంది.ఇప్పటికే సినిమాలోని ఒక్కో సాంగ్ ను విడుదల చేస్తున్న చిత్ర యూనిట్ తాజాగా ‘ప్రియతమా ప్రియతమా’అంటూ సాగే మరో లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేశారు.

దీనికి సంభంధించిన పోస్టర్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ పోస్టర్లో చైతు.. సమంతాలు ఇద్దరూ ఆర్టీసీ బస్సు ఫుట్ బోర్డ్ పై నిలబడి ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇద్దరి లుక్ చాలా యంగ్ గా ఉంది.షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి.. హరీష్ పెద్ది నిర్మిస్తున్న ఈ చిత్రానికి గోపి సుందర్ సంగీతం అందిస్తున్నారు.

Advertisement