యూట్యూబ్ లో రౌడీ బేబీ విధ్వంసకర రికార్డ్

తమిళ హీరో ధనుష్ , సాయి పల్లవి జంటగా నటించిన ‘మారి 2’ చిత్రంలోని ‘రౌడీ బేబీ’ వీడియో సాంగ్ ఇటీవల యూ ట్యూబ్ లో అప్లోడ్ అయిన గంటకే కోటి వరకు వ్యూస్ సాధించింది.

యూట్యూబ్ లో ట్రెండ్ ని క్రియేట్ చేసిన డీజే

ఇది సౌత్ ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే చాలా అరుదు.మొన్నటికి మొన్న కొలవెరి రికార్డ్ బద్దలు కొట్టిన ఈ పాట, తాజాగా ఇప్పుడు మరో రికార్డ్ ను సొంతం చేసుకుంది.

పాట విడుదలైన నెలరోజుల్లోనే 18 కోట్లకు పైగా వ్యూస్ సాధించి అందరిని షాక్ కి గురి చేస్తోంది. దక్షిణాదిన అత్యధిక వ్యూస్ తెచ్చుకున్న పాట ఇదే.ముఖ్యంగా ఈ పాటలో ధనుష్ సాయిపల్లవిల కెమిస్ట్రీకి, సాయిపల్లవి డ్యాన్స్ లో గ్రేస్ కి ఆడియెన్స్ ఫిదా అయ్యారు.

విచిత్రం ఎమిటంటే సాయి పల్లవి నటించిన ఫిదా లోని వచ్చిందే (182 మిలియన్) అలాగే ధనుష్ కొలవరి సాంగ్ ( 175మిలియన్) రెండు , మూడు స్థానాల్లో కొనసాగుతున్నాయి.ఈ సాంగ్ విజయంలో లీడ్ పెయిర్ కెమిస్ట్రీ హైలైట్ గా నిలిచింది. 

Advertisement