‘ఎన్‌జీకే’ టీజర్ విడుదల

సెల్వరాఘవన్ దర్శకత్వం లో సూర్య , సాయి పల్లవి , రకుల్ ప్రీతీ సింగ్ జంటగా తెరకెక్కుతున్న చిత్రం ‘ఎన్.జీ.కే’.పొలిటికల్ నేపథ్యంలో రాబోతున్న ఈ మూవీ పై తెలుగు , తమిళ ప్రేక్షకుల్లో భారీ అంచనాలే నెలకొని ఉన్నాయి.

త్వరలో సెట్స్ పైకి వెళ్లనున్న మన్మధుడు -2

ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఈ చిత్రానికి సంబందించిన ఫస్ట్ లుక్ టీజర్ ను ఈ రోజు విడుదల విడుదల చేసింది చిత్ర యూనిట్.

నాపేరు ఎన్‌జీకే. నంద గోపాల కుమారన్. అందరూ ఎన్‌జీకే అని పిలుస్తారు’ అంటూ సూర్య చెబుతున్న డైలాగ్‌తో టీజర్‌ మొదలవుతుంది . ఈ టీజర్‌ను బట్టి చూస్తే సూర్య చెవిటివాడి పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తుంది.

అసలు ఎన్‌జీకే రాజకీయాల్లోకి ఎందుకు వెళ్ళాలి అనుకుంటాడు..? ఆలా వెళ్ళడానికి కారణాలు ఏంటి..? ఎన్‌జీకే కు రకుల్ కు సంబంధం ఏంటి..? అనేది చిత్ర కథ.

ఎన్‌జీకే భార్యగా సాయి పల్లవి అతనికే మద్దతు తెలుపుతుంది.పొలిటికల్ బ్యాక్ డ్రాప్ తో రాబోతున్న ఈ సినిమాలో జగపతి బాబు ముఖ్య పాత్రలో నటిస్తున్నారు.

డ్రీం వారియర్ పిక్చర్స్ పతాకం పై ఎస్ ఆర్ ప్రభు నిర్మిస్తున్న ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు.