‘ఇస్మార్ట్‌ శంకర్‌’ కు జోడిగా ‘ఇస్మార్ట్ గర్ల్’

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, ఎనర్జిటిక్ హీరో రామ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ ట్యాగ్ లైన్‌ ‘డబుల్ దిమాక్ హైదరాబాదీ’.

డ్యూయల్ రోల్స్ లో కనిపించనున్న శర్వా

ప్రస్తుతం రెగ్యులర్ షూటింగ్ లో బిజీగా ఉన్న చిత్ర యూనిట్ తాజాగా రామ్ కు జోడిగా హీరోయిన్ ను ప్రకటించింది.

రామ్ పోతినేని పక్కన సవ్యసాచి ఫేమ్ నిధి అగర్వాల్ హీరోయిన్ గా ఎంపికైనట్లు మూవీ మేకర్స్ వెల్లడించారు.

ఈ విషయాన్ని సినిమా సహ నిర్మాత అయిన నటి చార్మి ట్విటర్ వేదికగా ఓ పోస్టర్‌ను రిలీజ్ చేశారు.”మా ‘ఇస్మార్ట్‌’ కుటుంబంలోకి నిధి అగర్వాల్‌కు స్వాగతం” అంటూ చార్మి ట్వీట్‌ చేశారు.

పాత బస్తీ నేపథ్యంలో ఉండబోతున్న ఈ చిత్రంలో రామ్‌ మరింత ఫిట్‌గా కనిపించనున్నారు. పూరీ కనెక్ట్స్‌ పతాకంపై పూరీ, ఛార్మి సినిమాను నిర్మిస్తున్న ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.

వైవిధ్యమైన పాత్రలో రామ్ నటిస్తున్న ఈ చిత్రంలో ఆశిష్ విద్యార్ధి, సత్య దేవ్ కీలక పాత్రలను పోషిస్తున్నారు.

ఫుల్ లెంగ్త్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమాని సమ్మర్ కానుకగా విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తుంది చిత్ర యూనిట్.

Advertisement