‘అర్జున్ సురవరం’ గా రానున్న నిఖిల్

ఇటీవల ఎక్కువ వార్తలో హీరో నిఖిల్ పేరు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా తన తాజా చిత్రం యెక్క టైటిల్ ముద్ర విషయంలో నిర్మాత నట్టి కుమార్ తో చెలరేగిన వివాదంలో బహిరంగానే 
నట్టి కుమార్ నిఖిల్ పై అసహనం వ్యక్తం చేశాడు.

‘డిస్కో రాజా ‘ఫస్ట్ లుక్ పోస్టర్

దింతో నిఖిల్ ఈ వివాదానికి పులిస్టాప్ పెడుతూ తన ముద్ర టైటిల్ ని వదులుకున్నాడు.తాజాగా తన సినిమాకి సంబందించిన కొత్త టైటిల్, ఫస్ట్ లుక్ విడుదల చేశాడు.ఇక ఈ చిత్రానికి ‘అర్జున్ సురవరం’ అనే టైటిల్ ను అధికారికంగా ప్రకటించారు.

ఈచిత్రంలో టైటిల్ రోల్ లో నటిస్తున్న నిఖిల్ జర్నలిస్ట్ గా కనిపించనున్నాడు.  కోలీవుడ్ సూపర్ హిట్ మూవీ ‘కనితన్’ కి రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నిఖిల్ కి జోడిగా లావణ్య త్రిపాఠి కథానాయికగా నటిస్తుంది.టి.సంతోష్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాని ప్రముఖ నిర్మాత ఠాగూర్ మధు సమర్పకుడిగా వ్యవహారిస్తున్నాడు.ఇక నిఖిల్ ‘అర్జున్ సురవరం’గా ప్రేక్షకులను ఎలా అలరిస్తాడో చూడాలి మరి.