స్లిమ్ముగా మారిన నిత్య మీనన్!

Nitya Menen New Lookప్రస్తుతం ఉన్న కథానాయికలలో పాత్రలకు ప్రాధాన్యం ఇస్తున్న వారిలో నిత్య మీనన్ ఒకరు.ఆమె చేసిన సినిమాలు తక్కువే అయినప్పటికీ,నటన పరంగా తన మార్కును వేసుకుంది.

ప్రిన్స్ తో నటించాలని ఉందన్న బాలీవుడ్ క్వీన్

ఆ మధ్య సినిమాలకు కాస్త దూరంగా ఉన్నట్లు అనిపించినా,ప్రస్తుతం ఆమె బిజీగా ఉంది.నిజానికి నిత్యామీనన్‌ లావుగా ఉందని అందుకే సినిమా అవకాశాలు తగ్గాయని రూమర్స్‌ వినిపించాయి.

అదే విషయాన్ని ఆమెను అడిగితే,నేను ఎలా ఉంటే వారికేంటి.. నటన ముఖ్యం కదా అంటూ చెప్పుకొచ్చింది.ఇప్పుడు నిత్యను చూస్తే అందరు షాక్ అవ్వాల్సిందే.చూస్తుంటే ఆమె పూర్తిగా జీరో సైజ్‌లోకి మారినట్టు కనిపిస్తోంది.

తాజాగా ఆమె ఒక ట్వీట్ చేసింది. ‘హైవే పై షూట్‌.. కొత్త ప్రాజెక్ట్‌కు సంబంధించిన ప్రకటన త్వరలో చెబుతాను’ అంటూ పిక్ పెట్టింది.ఇప్పుడు ఈ పిక్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది.

క్రీడా నేపథ్యంలో తెరకెక్కబోతున్న చిత్రం కోసమే ఆమె బరువు తగ్గిందని సమాచారం.ప్రస్తుతం ఆమె ప్రాణ, ఐరన్‌ లేడీ, బాలీవుడ్‌లో అక్షయ్‌ కుమార్‌ ‘మిషన్‌ మంగళ్‌’తో బిజీగా ఉంది.