నోటా రివ్యూ : టైటిల్ కి సంబంధమే లేని సినిమా!

నోటా రివ్యూ | నోటా సినిమా రివ్యూ | విజయ్ దేవరకొండ | మెహ్రీన్ | సత్య రాజ్ | నాసర్ | జ్ఞానవేల్ రాజా

నోటా రివ్యూ: 2.75/5.0

NOTA Review In English

Vijay Stills At NOTA Interview

తారాగణం : విజయ్ దేవరకొండ,మెహ్రీన్ ,నాజర్ ,సత్య రాజ్
విడుదల తేదీ : 4 అక్టోబర్ ,2018 (USA )
డైరెక్టర్ : ఆనంద్ శంకర్
ఫోటోగ్రఫీ : సంతాన కృష్ణ రవిచంద్రన్
బాణీలు : సామ్ సీఎస్
ఎడిటర్ : రేమండ్ డెరిక్ కాస్థా
ప్రొడ్యూసర్ :జ్ఞానవేల్ రాజా
ప్రొడక్షన్ కంపెనీ : స్టూడియో గ్రీన్స్

అర్జున్ రెడ్డి ,గీత గోవిందం లాంటి విజయాల తర్వాత , విజయ్ దేవరకొండ చేస్తున్న ప్రత్యేక సినిమా “నోటా”. నోటా అంటే అర్ధం “పై అభ్యర్థులెవరూ కాదు ” అని అర్ధం . అంటే ., వోట్ హక్కు వినియోగించుకొనే వాళ్ళు దీన్ని ఎన్నుకొని తమకు అభ్యర్థుల్లో ఎవరు ఆమోదం కాదని తెలియ చేయ వచ్చు.

మాములు ఎన్నికలు కూడా దగ్గర పడడం తో ఈ సినిమా ప్రభావం ఏమైనా ఉంటుందా లేదా అని కొంత ఆసక్తి అయితే ఉంది సినీ ,రాజకీయ వర్గాల్లో ! మరి నోటా ఈ అంచనాలకు తగ్గట్లు ఉంటుందో లేదో ఇంకొన్నిగంటల్లో తెలిసిపోనుంది.

కథ :

ఏ పి సీఎం వాసుదేవన్(నాజర్ ) కొడుకు వరుణ్ (విజయ్ దేవరకొండ ) లండన్ నుంచి హాలిడే కోసం ఇండియా వస్తాడు . అయితే వాసుదేవన్ ఒక కేసు లో ఇరుక్కోవడం ,పదవి వదలాల్సి రావడం లాంటి పరిణామాలతో ఆ కేసు కోర్ట్ లో హియరింగ్ వరకు కొడుకు వరుణ్ ని సీఎం చేస్తాడు. ఇలా ఏమీ తెలీకుండా ., తన ప్రమేయం లేకుండా తాత్కాలిక సీఎం అయిన వరుణ్ కు తన తండ్రి అరెస్ట్ తో షాక్ తగులుతుంది. సీఎం గా కొనసాగుతూ ., కొన్ని పరిణామాల వలన ఆ పదవి కి ఉన్న పవర్ ఏంటో తెలుసుకుంటాడు.

బెయిల్ దొరికిన వాసుదేవన్ ఢిల్లీ నుంచి వస్తుండగా అతని మీద హత్య యత్నం జరుగుతుంది. ఇలా అనుకోని పరిస్థితుల్లో వరుణ్ సీఎం గా కొనసాగుతాడు. తన పనుల్లో వాసుదేవన్ ప్రత్యర్థి , ఒక పత్రిక ఎడిటర్ అయిన మహావీర్ (సత్య రాజ్ ) సహాయం తీసుకుంటూ పరిపాలన సాగిస్తుంటాడు.

సీఎంగా వరుణ్ ఎదుర్కొనే పరిస్థితులు ఏంటి ? వాసుదేవన్ మళ్ళీ రాజకీయాలు చేస్తాడా ? ఈ మధ్య లో జరిగే ఫ్యామిలీ డ్రామా ఏంటి ? ఇలాంటి రకరకాల ఉప కథలు కలిసి నోటా ను తయారు చేశాయి.

NOTA Review In English

విశ్లేషణ :

కొన్ని సినిమాలు సరైన టైం లో పడితేనే ., వారు పడిన కష్టానికి ఒక అర్ధం .. పరమార్ధం !! భరత్ అనే నేను లాంటి పవర్ ఫుల్ రాజకీయ చిత్రం వచ్చాక .,మళ్ళీ అదే కథ అటు ఇటు గా వస్తే ఎలా ఉంటుందో ., నోటా అలా వుంది. నోటా అంటే “ఏ అభ్యర్థి ఇష్టం లేకపోవడం “. మరి ఆ టైటిల్ కి న్యాయం చేసే విధం గా సినిమాలో ఒక్క బిట్ కూడా లేదు.

రాజకీయ వారసత్వం ,పదవి కోసం పాకులాట , మధ్యలో కొన్ని మూఢ నమ్మకాలు , సీఎం హాస్పిటల్ లో బాగయ్యాక కూడా బయట ప్రపంచానికి చెప్పకపోవడం ,ఎమ్మెల్యేల కొనుగోలు ,వారిని రిసార్ట్ లో పెట్టడం ,అవిశ్వాసం ,మధ్యలో వేల కోట్లు అనే మడికట్టు పదాలు , స్వామిజి లు ,పనామా బ్యాంకు లు ., అబ్బో నోటా చూపించని చిత్రం లేదు. దక్షిణాది రాజకీయాల్లో జరిగే నాటకీయత అంతా నోటా లో నే ఉంది.
కాకుంటే వాటిని ఒక పద్ధతి లో పెట్టకుండా ., అన్ని ఒక్క సినిమాలోనే చూపించేయాలి అనే తాపత్రయం లో సినిమా గాడి తప్పింది.

మొదటి సగం కొంచెం ఆసక్తి కలిగించింది. విజయ్ కి పరిపాలన పట్ల ఉన్న అవగాహనా లేమి , అతని తప్పులు ,అతని పరివర్తన ,సత్య రాజ్ తో కలిసి వరదల ప్రమాదాన్ని తగ్గించడం ., ఇలా కొన్ని చెప్పుకోదగ్గ సన్నివేశాలతో పర్లేదు అనిపించింది . సగానికి వచ్చేసరికి విజయ్ ఇక సీరియస్ గా సీఎం అయిపోతాడు .

ఇక రెండో సగం లోనే దర్శకుడు తన పాండిత్యాన్ని ప్రదర్శన కు పెట్టేశాడు.నాజర్ పై హత్య యత్నం ,హాస్పిటల్ ఎపిసోడ్,ప్రియదర్శి పనామా ఎపిసోడ్ , విజయ్ చెడ్డ పేరు తెచ్చుకోవడం, క్షణాల్లో మంచి పేరు తో ప్రత్యర్థులను గెలిచేయడం , వేల కోట్లు చిటికలో సంపాదిచేయడం, మాట్లాడితే కాళ్ళ మీద పడే వాడికి సీఎం పదవి అప్పగించే యత్నం,రిసార్ట్ లో ఎమ్మెల్యే ల ఓవర్ యాక్షన్ ..అబ్బో రెండో సగం లో తలనొప్పి తెప్పించే అంశాలు చాలా ఉన్నాయి.

వీటికి తోడు సత్య రాజ్ లవ్ స్టోరీ , నాజర్ ఫ్యామిలీ స్టోరీ !! వీటన్నిటి మధ్యలో విజయ్ నిస్సహాయం గా చూస్తూ నిలబడిపోయాడు. చూసే వాళ్ళు కూడా “ఏంటి మా కిది ” అని!

ఇలాంటి సినిమాకి పొడవు అయినా తక్కువ ఉండాలి. కానీ ఎడిటర్ తన పనేం చేసినట్లు లేడు. ఇక మ్యూజిక్ సరే సరి !! ఇంటర్వెల్ కి ముందు విజయ్ “ఇక నుంచి రౌడీ సీఎం ఏం చేస్తాడో చూపిస్తా ” అంటుంటే నీరసంగా ఒక సౌండింగ్ వచ్చి చూసే జనాలకు నీరసం తెప్పిస్తుంది.

ఇక నటీ నటుల విషయానికి వస్తే ., విజయ్ తనకి స్కోప్ ఉన్నంతలో బాగా చేశాడు. మెహ్రీన్ ఎందుకు ఉందొ ఎవరికీ తెలీదు. సినిమా స్టార్ట్ అయిన మొదటి పది నిమిషాల్లో విజయ్ ,మెహ్రీన్ ని ఉద్దేశించి “రోజు రోజు కీ మరీ అందం గా తయారవుతుంది ” అంటాడు .అది తప్పించి ఈ సినిమాలో రొమాన్స్ అనే మాట లేదు !! పాపమ్ మెహ్రీన్ కి, విజయ్ చెల్లెలిగా నటించిన పాప కి ఉన్నన్ని సీన్స్ కూడా లేవు.

NOTA Review In English

ప్రతిపక్ష పార్టీ కళావతి గా సంచనా నటరాజన్ బాగా చేసింది. తమిళ్ బిగ్ బాస్ లో కనిపించిన యాషిక , విజయ్ ఫ్రెండ్ గా రెండు సీన్స్ లో కనిపించింది.

నాజర్ ,సత్య రాజ్ కి మంచి పాత్ర లు దక్కాయి. నిజానికి విజయ్ కంటే కూడా వారికే ప్రాధాన్యమున్న పాత్రలు దక్కాయి. రాజకీయ కాంక్ష ఉన్న పాత్ర లో నాజర్ విభిన్నం గా ఉన్నాడు. సత్య రాజ్ ఎడిటర్ గా , వరుణ్ సహాయకుడిగా మంచి పాత్ర చేశాడు.

ఇక చివరిగా ఈ నోటా బోర్ కొట్టించదు కానీ ., మెప్పించదు కూడా!!విజయ్ కోసం ఒకసారి చూడొచ్చు!!

ఒక్క మాటలో : టైటిల్ కి సంబంధమే లేని సినిమా!

 

Advertisement