‘#RRR’ లో ఎన్టీఆర్ డైలాగ్స్..

NTR Dialogues in RRRరాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న సినిమా ‘#RRR’.ఈ సినిమాలో ఎన్టీఆర్ ,రామ్ చరణ్ కథానాయకులుగా నటిస్తున్నారు.బాహుబలి తరువాత రాజమౌళి ఎలాంటి మ్యాజిక్ చేస్తారోనని యావత్ భారత్ అంతా ఎదురు చూస్తుంది.

‘#RRR’ కీలక పాత్రలో సముద్రఖని!

తాజాగా ఈ సినిమా నుండి మరో అప్డేట్ బయటకు వచ్చింది.ఈ సినిమాకు మాటల రచయిత సాయి మాధవ్ బుర్రా మాటలు రాస్తున్నారు.ఆయన ఎన్టీఆర్ కోసం రాసిన డైలాగులు ఈ సినిమాకే హైలెట్ కానున్నాయట.

ఇక ఎన్టీఆర్ డైలాగులు చెప్పడంలో మంచి దిట్ట అని అందరికి తెలిసిందే.ఆ డైలాగులు ఎన్టీఆర్ పలికేటప్పుడు సెట్ లోని వారందరికీ వెంట్రుకలు నిక్కపొడిచాయట.అలాంటిది థియేటర్లో చూస్తే అభిమానుల కేరింతలకు హద్దే ఉండదు.ఈ సినిమాను డీవీవీ ఎంటెర్టైన్మెంట్స్ పతాకంఫై డీవీవీ దానయ్య నిర్మిస్తుండగా,కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

Advertisement