భారీగా అమ్ముడుపోయిన ఎన్టీఆర్ డిజిటల్ రైట్స్!

NTR Movie Digital Rightsక్రిష్,బాలకృష్ణ కలయికలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఎన్టీఆర్ బయోపిక్’.ఇటీవలే బయోపిక్ ఆడియో వేడుక భారీగా నిర్వహించారు.ఈ వేడుకలో సీనియర్ నటులు,నందమూరి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

ఎన్టీఆర్ ట్రైలర్ : నటుడు, నాయకుడు ., మనీషి !!

ఎన్టీఆర్ ట్రైలర్ విడుదలయ్యాక ,సినిమాపై అంచానాలు భారీగా పెరిగాయి.దాంతో బయ్యర్లు అధిక మొత్తంతో ఈ సినిమాను కొనడానికి ముందుకొచ్చారు.

అంతేకాదు ‘కథానాయకుడు’ డిజిటల్ హక్కులను అమెజాన్ ప్రైమ్ సంస్థ 25 కోట్లకు దక్కించుకుంది.ఇవి కేవలం డిజిటల్ రైట్స్ మాత్రమే.ఇంకా శాటిలైట్ హక్కులు కలుపుకుంటే మొత్తం కథానాయకుడు 50 కోట్ల దాకా వసూలు చేసినట్టే.

జనవరి 9న ప్రపంచవ్యాప్తంగా ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ విడుదల కానుంది.విడుదలకు ముందే దాదాపు పెట్టుబడులు రాబట్టడం గమనార్హం.ఈ లెక్కన చూస్తుంటే కథానాయకుడు భారీగానే వసూళ్లు చేసి బాక్స్ ఆఫీస్ వద్ద కొల్లగొడతాడని తెలుస్తుంది.