భారీకాయకుడిగా కనిపించబోతున్న ఎన్టీఆర్

 

ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ తో కలసి ఎన్టీఆర్ మల్టీస్టారర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

వైరల్ అవుతున్న అనుష్క న్యూ లుక్

గతంలో టెంపర్ చిత్రం కోసం తొలిసారి సిక్స్‌ ప్యాక్‌లో కనిపించడానికి కొత్త లుక్‌ను ఫ్యాన్స్‌కు పరిచయం చేయడానికి అప్పట్లో ఎన్టీఆర్ బాగానే శ్రమించారు.

ఇటీవల వచ్చిన అరవింద సమేత సినిమాలోనూ పెర్ఫెక్ట్ సిక్స్ ప్యాక్ తో వెండితెరను షేక్ చేసిన ఎన్టీఆర్ తాజాగా ఆర్ఆర్ఆర్ సినిమా కోసం భారీ మొత్తంలో శారీరక ఆకృతిని మార్చుకొని పహిల్వాన్ లాంటి పాత్రలో కన్పించబోతుండడం టాక్ అఫ్ ది ఇండస్ట్రీగా మారింది.

హాలీవుడ్ ట్రైనర్ లాయర్ స్టీవెన్స్ శిక్షణలో దర్శకుడు రాజమౌళి డిమాండ్ మేరకు ఎన్టీఆర్ ఈ పాత్రకోసం కోసం దాదాపు 20 కేజీల బరువు పెరిగినట్లు సమాచారం.

ప్రస్తుతం రెండో షెడ్యూల్ లో రామ్ చరణ్ తో కలసి పోలీస్ స్టేషన్ సెట్ బ్యాక్ డ్రాప్ లో కొన్ని సన్నివేశాలు చిత్రీకరించనున్నట్లుగా తెలుస్తుంది.

Advertisement