అడవి దొంగగా ఎన్టీఆర్…?

దర్శక దిగ్గజం ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంబినేషన్‌లో భారీ మల్టీస్టారర్‌ చిత్రం ఆర్ఆర్ఆర్ (వర్కింగ్ టైటిల్)లో కలిసి నటిస్తున్న
సంగతి తెలిసిందే.

భారతీయుడు -2 లేటెస్ట్ అప్డేట్స్

ఇప్పటికే ఈ చిత్రం మొదటి షెడ్యూల్‌ పూర్తి చేసుకోగా నిన్నటి నుండి రెండవ షెడ్యూల్ ను ప్రారంభించారు.

ఇక ఈ చిత్రం మొదలైనప్పటి నుంచి ఈ చిత్రంలోని పాత్రల పై రకరకాల ఊహాగానాలు వెలుబడతున్నాయి.

అయితే తాజాగా ఈ చిత్రానికి సంభందించి మరో వార్త వైరల్ అవుతుంది.ఈ సినిమాలోని ఎన్టీఆర్‌ పాత్రలో విలనిజం ఛాయలు కనిపిస్తాయని, తను అడవి దొంగ కాగా ఆయనను పట్టుకొనే పనిలో చరణ్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నారని వార్తలు వస్తున్నాయి.

ఇక ఈచిత్రంలో ముగ్గురు కథానాయికలు నటించనున్నారని త్వరలోనే వారి పేర్లను అధికారికంగా ప్రకటించనున్నారని తెలుస్తుంది.

ఈ చిత్రం యొక్క శాటిలైట్ రైట్స్ కోసం ఫుల్ డిమాండ్ ఏర్పడింది.ప్రముఖ టెలివిజన్ నెట్ వర్క్ జీ టీవీ ఈచిత్రం యొక్క హిందీ ,తెలుగు , తమిళం శాటిలైట్ రైట్స్ కోసం సుమారు 150కోట్లు కోట్ చేసిందని సమాచారం.కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో దానయ్య నిర్మిస్తున్నారు.

Advertisement