ఓట్స్ పాయసం

ఓట్స్ తినడం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి.మధుమేహగ్రస్తులకు, హై బ్లడ్ ప్రెజర్ ఉన్నపేషంట్స్ కు ఓట్స్ ఒక గొప్ప ఆరోగ్యకరమైన ఆహారపదార్థం.ప్రస్తుత రోజుల్లో ఓట్స్ ను ఒక సూపర్ ఫుడ్ గా పరిగణిస్తున్నారు. మరి ఓట్స్ తో పాయసం చేసుకొని తింటే చక్కటి రుచిని అందించడమే కాక మంచి ఆరోగ్యాన్ని కూడా ఇస్తుంది.ఇప్పుడు మరి ఓట్స్ పాయసం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం.

వెజిటబుల్ ఫ్రైడ్ రైస్

oats payasam Recipe

కావలసిన పదార్థాలు;

ఓట్స్‌ – 1 కప్పు,
మీగడ తీసిన పాలు – 1 కప్పు,
యాలుకల పొడి – కొద్దిగా,
రోజ్‌ వాటర్‌ – 2 టీ స్పూన్లు,
బ్రౌన్‌ షుగర్‌ – 1/2 కప్పు,
కర్జూరాలు (ముక్కలు) – 4 ,
డ్రై ఫ్రూట్స్‌ ముక్కలు – కొన్ని (వేయించి పెట్టుకోవాలి).

తయారీ విధానము;
ముందుగా స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని అందులో పాలను పోసి వేడిచేయాలి. తరువాత యాలుకల పొడి, రోజ్‌ వాటర్‌ వేసి కాసేపు మరిగించాలి. తరువాత కర్జూర ముక్కలు, ఓట్స్‌ వేసి బాగా కలుపుకోవాలి.
ఓట్స్‌ ఉడికాక బ్రౌన్‌ షుగర్‌ వేసి అది కరిగేంత వరకు గరిటెతో కలియ తిప్పాలి. డ్రై ఫ్రూట్స్‌ పలుకలతో అలంకరించి ఒక బౌల్ లోకి సర్వ్ చేసుకొని వేడి వేడిగా తింటే ఓట్స్ పాయసం చాలా రుచిగా ఉంటుంది.

Advertisement