‘ఆపరేషన్‌ గోల్డ్‌ఫిష్‌’టీజర్‌ని విడుదల చేసిన సూపర్‌స్టార్‌

ఆది సాయి కుమార్‌ నటిస్తున్న తాజా చిత్రం ‘ఆపరేషన్‌ గోల్డ్‌ఫిష్‌’.ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్స్‌, ఫస్ట​ లుక్స్‌ను రానా, త్రివిక్రమ్‌లతో రిలీజ్‌ చేయించింది చిత్ర యూనిట్‌. తాజాగా సూపర్‌స్టార్‌ మహేష్‌ బాబు చేతుల మీదుగా టీజర్‌ను విడుదల చేయించి సినిమాకు మరింత క్రేజ్ ను పెంచుతుంది సినిమా యూనిట్.

త్రివిక్రమ్ కి ఓకే చేపియినా ‘వెంకీ మామ’

ఇప్పుడీ ఈ మూవీ టీజర్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారింది.దేశంలో ప్రస్తుత పరిస్థితులు కూడా ఈ సినిమాకు అనుకూలంగా ఉన్నాయి. హూ ఈజ్‌ ది గోల్డ్‌ ఫిష్‌ అంటూ ఆసక్తికరంగా మలిచిన ఈ టీజర్‌ అందర్నీ ఆకట్టుకునేలా ఉంది.

మాటల రచయితగా మంచి పేరు తెచ్చుకున్న అబ్బూరి రవి కీలకపాత్రలో నటిస్తుండగా ఎయిర్‌టెల్‌ అడ్వేటేస్మెంట్ భామ సాషా ఛెత్రి హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ మూవీకి ‘వినాయకుడు’ ఫేమ్ సాయికిరణ్ అడివి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు.

చాలాకాలంగా హిట్‌ కోసం ఎదురుచూస్తున్న ఆది సాయి కుమార్‌కి,అలాగే మొదటి సారి వెండితెరపై తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతోన్న అబ్బూరి రవి, సాషా ఛెత్రిలకు ఈ సినిమా విజయాన్ని ఇస్తుందో లేదో చూడాలి.

 

Advertisement