పాలకూర ఆమ్లెట్

గుడ్డు మంచి ప్రొటీన్ ఆహారం… పాలకూర లో ఎ విటమిన్ అధికంగా ఉంటుంది . ఈ రెండు కలిస్తే శరీరానికి పోషకాలు మెండుగా అందుతాయి.
ఈ పాలకూర ఆమ్లెట్ రోజూ తిన్నా మంచిదే. వీలు కాకపోతే వారానికి మూడు సార్లు తిన్నా శరీరానికి పోషకాలు బాగా అందుతాయి. పాలకూర ఆమ్లెట్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం.

ప్రభాస్ 21 సినిమా సుకుమార్ తో నట !

Palakura Omelet

కావాల్సిన పదార్థాలు;

పాలకూర తరుగు – 1/2 కప్పు
గుడ్లు – 4
ఆలివ్ నూనె – 2 టీ స్పూనులు,
మిరియాల పొడి -1 టీ స్పూను

తయారుచేసే విధానం;

ముందుగా పాలకూర ఆకుల్ని ఉడికించి మెత్తగా చేసి పెట్టుకోవాలి.
ఒక గిన్నెలో గుడ్లు పగులగొట్టి వేసుకోవాలి. అందులో కాస్త ఉప్పు, మిరియాల పొడి వేసి బాగా గిలక్కొట్టాలి.
ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి పాలకూర తరుగును వేసి, అందులోని నీరు పోయి… పచ్చి వాసన కూడా పోయే వరకు వేయించుకోవాలి .
అప్పుడు ఆ కళాయి దించేసి ఆమ్లెట్ వేసేందుకు పెనం పెట్టాలి. పెనం మీద కాస్త ఆలివ్ నూనె వేసి దాని పై గిలక్కొట్టిన గుడ్ల సొన  కూడా వేసి పైన వేయించిన పాలకూర ని వేసుకోవాలి.
రెండు వైపులా మంచిగా కాల్చుకోవాలి. అంతే రుచికరమైన పాలకూర ఆమ్లెట్ సిద్ధం.