‘యాత్ర’ నుండి గుండెను కదిలించే పల్లె పాట..

దివంగత నేత వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి పాదయాత్ర ఘట్టాన్ని ‘యాత్ర ‘ పేరుతో మహి వి రాఘవ దర్శకత్వం వహించాడు.ఇప్పటికే విడుదలైన టీజర్స్‌, పోస్టర్స్‌, సాంగ్స్‌ ఈ సినిమాపై అంచనాలను పెంచేశాయి.

వైఎస్‌ పాత్రలో మలయాళ మెగాస్టార్‌ మమ్ముట్టి నటిస్తున్నవిషయం తెలిసిందే.తాజాగా ఈ చిత్రబృందం చిత్రం నుంచి గుండెను కదిలించే ఓ పాటను విడుదల చేసింది.

పల్లెల్లో కల ఉంది.. పంటల్లో కలిముంది అంటూ సాగే ఈ పాటలో రైతుల కష్టాలను, వారు పడే బాధలను వివరించారు. సిరివెన్నెల సీతారామ శాస్త్రి సాహిత్యాన్ని అందించగా, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఈ పాటను పాడారు.ఈ చిత్రానికి కె కృష్ణ కుమార్‌ సంగీతాన్ని అందించారు.

శివ మేక సమర్పణలో 70 ఎంఎం ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై విజయ్‌ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మించిన ఈ సినిమా ఫిబ్రవరి 8న తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో విడుదలవుతోంది.ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా పాటను చూడండి.

యాత్ర ట్రైలర్:వస్తున్నాడు ప్రజా సైనికుడు

Advertisement