పన్నీర్ గులాబ్ జామున్

గులాబ్ జామున్ అంటే అందరికీ ఇష్టమైన స్వీట్ డిష్ .ముఖ్యంగా పండుగల సమయం లోను మరియు, ఇంట్లో శుభకార్యాలకు ,ఈ స్వీట్ జామ్ ను తయారు చేస్తుంటారు .
అదే విధంగా ఈ స్వీట్ యొక్క అద్బుతమైన రుచి ఇంకొంచెం ఎక్కువ తినేలా చేస్తుంది .
అంతేకాక ఇందులో న్యూట్రీషియన్స్ విలువలు కూడా ఎక్కువగానే ఉంటాయి .
ఇది మీకు ఎనర్జిని..మంచి ఉల్లాసాన్ని కూడా అందిస్తుంది. మరి ఈ రుచికరమైన పన్నీర్ గులాబ్ జామున్ ఎలా తయారు చెయ్యాలో చూద్దాం…

హరికృష్ణ కూతురికి టికెట్ – బాబు గారి వాడకం మొదలయింది

Paneer Gulab Jamun

కావల్సిన పదార్థాలు:

పాల పొడి : 2 కప్పులు
రవ్వ : 2 కప్పులు
గుడ్డు : 1
పన్నీర్ తురుము : 1 కప్పు
పంచదార : 1 కప్పు
నీళ్లు : 2 కప్పులు
బేకింగ్ సోడ : 1/4 టీ స్పూను
నూనె : ఫ్రై చేయడానికి సరిపడా

తయారుచేయు విధానం:

ముందుగా నీళ్లలో పంచదార వేసి స్టౌ మీద పెట్టి పంచదార పాకం తయారైయ్యే వరకూ చిక్కగా ఉడికించుకోవాలి.
తర్వాత ఒక మిక్సింగ్ బౌల్లో సూజి(రవ్వ), పన్నీర్ తురుము, పాల పొడి మరియు గుడ్డు వేసి మొత్తం మిశ్రమాన్ని పేస్ట్ లా చేసుకొని,
పది నిముషాలు పక్కన పెట్టి, అందులో నుండి కొద్దిగా కొద్దిగా తీసుకొని చిన్న ఉండలుగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి.
తర్వాత స్టౌ మీద పాన్ పెట్టి, నూనె వేసి వేడి అయ్యాక అందులో పన్నీర్ ఉండలు వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకొని , తర్వాత వీటిని తీసి ముందుగా తయారుచేసి పెట్టుకొన్న
పంచదార పాకంలో వేసి డిప్ చేయాలి .
అంతే రుచికరమైన పన్నీర్ గులాబ్ జామున్ రెడీ. 15-30నిముషాలు అయిన తర్వాత సర్వ్ చేస్తే చాలా రుచి గా ఉంటుంది.

Advertisement