కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్ … : పవన్ -రేడియో- ఓ ఫోటో !

రాజకీయమందు నటుల రాజకీయం వేరయా .. విశ్వదాభిరామ .. చూడరా వీరి డ్రామా !! అన్నట్లుంది పోలింగ్ తర్వాత జనసేనాని విశ్రాంతి తీసుకుంటున్న తీరు. ఏం చేసినా హడావిడి , గ్లామర్ , సింప్లిసిటీ పేరుతో అతి జోడించడం పవన్ కి రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత అబ్బిన కొత్త అలవాటు.

బాబుకి బహిరంగ లేఖ రాసిన జనసేనాని

ఆయనేదో మార్పు మార్పు అంటుంటే అదేంటో కొత్తగా ఉందే అని వెళ్లిన జనాలకు పాచిపోయిన విమర్శలు , అర్ధం లేని ఆవేశం, ఆలోచన లేని ప్రసంగాలతో నీరసం తెప్పించిన పవనుడు ఇప్పుడు మిగిలిన ఆ కొద్దిపాటి సినీ ,కుల అభిమానులకి తన విశ్రాంతి ఫోటో లతో కొంచెం ఆనందం కలిగిస్తున్నాడు.

pawan after elections

pawan janasenaఇదిగో ఈ ఫోటో లాంటి మరి కొన్ని ., ఒంటరిగా . ఒక రేడియో తో జనసేన ఆఫీస్ లో కూర్చొని , జెండా -తానూ -ఆకాశం అంటూ సామాన్య మానవులకు అర్ధం కాని , కేవలం జన సైనికులకు మాత్రమే అర్ధమయే అలౌకిక ఆనందాన్ని పొందుతున్న ఫోటోలని తన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు .

ఇక ఎన్నికలు -ఎగ్జిట్ పోల్స్ కి వస్తే గాజువాక ,భీమవరం లో పోటీ చేసిన పవన్ , గాజువాక లో గెలిచే అవకాశం ఉందని తెలుస్తోంది . కాబట్టి ముందు ముందు మరిన్ని సినీ- రాజకీయ వేషాలు మనం జనసేనాని నుంచి ట్విట్టర్ సాక్షిగా చూడొచ్చన్నమాట !