బాబు – పవన్ కలయిక రాష్ట్రం కోసమేనట!

Pawan Chandrababu Allianceఏపీలో ఎన్నికలు దగ్గర పడుతుండటంతో నేతల పార్టీ ఫిరాయింపులు, పొత్తులు శరవేగంగా జరిగిపోతున్నాయి.మొత్తం 175 స్థానాలకు పోటీ చేస్తామంటూ చెబుతూ వచ్చిన జనసేన పార్టీ, టీడీపీతో రహస్య ఒప్పందాలు జరిపాయట.

వైసీపీలో చేరనున్న మరో టీడీపీ ఎమ్మెల్యే!

ఈ రెండు పార్టీలూ సాధారణ ఎన్నికల్లో మరోసారి కలసి పోటీ చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నాయట.పొత్తులపై ఇప్పటికే ఇద్దరు మిత్రులు మధ్య ఒప్పందాలు కుదిరాయట.

చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ లు రహస్యంగా భేటీ అయి ఈ దిశగా ఇప్పటికే చర్చలు జరిపారట.ఎవరు ఎన్ని సీట్లలో పోటీ చేయాలనే సంఖ్యపై కూడా దాదాపు ఒక అవగాహనకు వచ్చారట. ఏయే స్థానాల్లో ఎవరిని పోటీకి నిలపాలన్న అంశాలపై కూడా లోతుగా చర్చించారట.

ఇప్పుడు కలసి పోటీ చేస్తామంటే ప్రజలు అంగీకరించే పరిస్థితి లేదు. మరి వారిని ఎలా ఒప్పించాలన్న కోణంలో ఆలోచిస్తున్నారట.ఏముంది మేం రాష్ట్రం కోసం కలుస్తున్నామని చెబుతారట.