పవన్ కి తెలిసిపోయిందా?

Pawan Kalyan Politicsఎన్నికలకు పట్టుమని పాతిక రోజులు కూడా లేవు. ఈ సమయంలో వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకొని, ఎవరైన తమ పార్టీ గురించి ఎక్కువగా చెప్పుకుంటారు లేదా నాలుగు ఓట్లు రాలే విధంగా విమర్శలు చెస్తారు.

జనసేనానికి అభ్యర్థులు కరువయ్యారే!

కానీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాత్రం రాజమహేంద్రవరంలో జరిగిన, తమ పార్టీ అయిదవ వారికొత్సవం వేళ ఎప్పటి మాదిరిగానే ఉపన్యాసం ఇచ్చారు.ఎవరైనా అధికార పార్టీని దించి మాకు అధికారం అప్పగించడని అడుగుతారు. ఆ విధంగా అధికార పార్టీ అక్రమాలను కూడా ఎండగడతారు.

కానీ ఏపీలో పవన్ కళ్యాణ్ తీరే వేరు. అధికారంలో ఉన్న చంద్రబాబుని అలా పక్కన వదెలేసి జగన్ మీద పడ్డారు.జగన్ బీసీల కోసం ఏం చేశారు అంటూ విరుచుకుపడ్డాడు.

పవన్ స్పీచ్ చూస్తూంటే ఏపీకి జగన్ సీఎం అయ్యాడా అనిపించక మానదు. అంటే రేపో మాపో జగన్ సీఎం అవుతారని వూహించారో ఏమో తెలియదు కానీ, బాబుని వదిలేసి జగన్ మీదనే పవన్ మొత్తం ద్రుష్టి పెట్టారు.