అలీ పై స్వరం మార్చిన పవన్ !

ఈ మద్యే ఎన్ టీవీ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో “అలీ ఒక స్వత్రంత్ర భావాలు కలిగిన వ్యక్తి. వైసీపీ లో జాయిన్ అవడం అతని ఇష్టం. స్నేహాన్ని అడ్డు పెట్టుకొని నా పార్టీ లోకి రమ్మని నేను అడగలేను. అతనికి ఏమనిపిస్తే అది చేసే హక్కు తనకి ఉంది ” అంటూ విశాల భావాలు గల వ్యక్తి గా మాట్లాడిన పవన్ కి ఒక్క వడ దెబ్బ తో జ్ఞానోదయం అయినట్లుంది.

No Seats On Caste Basis - PawanKalyan

ఈరోజు ఎలక్షన్ ప్రచారం లో మాట్లాడుతూ జన సైనికుల్ని ఉద్దేశించి “మీరేమో పవన్ సీఎం సీఎం అని అరవండి. అక్కడ అలీ లాంటి వాళ్ళు డబ్బులు పంచే జగన్ లాంటి వాళ్ళని సీఎం గా సపోర్ట్ చేస్తూ ఉంటారు.అరే .. అలీ కి అతని తమ్ముడి కి ,అతని కుటుంబానికి నేనెంత సహాయం చేశాను .కానీ అలీ ఏమో జగన్ కి సపోర్ట్ చేస్తాడు. ఎందుకంటే ఆయనకీ తెలుసు నేను గెలవను .. గెలిచేది వైసిపి అని ” అంటూ తన ఆవేదనని ,అక్కసు వెళ్లగక్కేశాడు.