పెప్పీసాంగ్‌కు స్టెప్పులేస్తున్న పాయల్‌

Payal Rajputh Special song in Seetha Movie
తేజ దర్శకత్వంలో బెల్లంకొండ శ్రీనివాస్, కాజల్ అగర్వాల్‌ జంటగా నటిస్తున్నతాజా చిత్రం ‘సీత’.కాజల్‌ నెగిటివ్‌రోల్‌ లో కనిపించనున్న ఈచిత్రంలో సోనూ సూద్‌ చాలా కాలం తరువాత మళ్లీ టాలీవుడ్‌ సినిమాలో నటిస్తు‍ండటం విశేషం.

మహర్షి మూవీ లేటెస్ట్ అప్డేట్స్

అయితే తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రంలో ఆర్ఎక్స్ 100′ ఫేమ్ పాయల్‌ రాజ్‌పుత్‌ బంపర్‌ ఆఫర్‌ దక్కించుకుంది. ఈ సినిమాలో ఒక పెప్పీసాంగ్‌కు స్టెప్పులేసే లక్కీ చాన్స్‌ దక్కించుకుందట పాయల్‌. అనూప్‌ రూబెన్స్‌ స‍్వరపర్చిన ఈ పాటను హైదరాబాద్‌ శివార్లలో ప్రత్యేకంగా వేసిన భారీ సెట్‌లో చిత్రీకరించబోతున్నారని సమాచారం.

పాయల్‌, కాజల్‌, బెల్లంకొండ శ్రీనివాస్‌లపై ఈ స్పెషల్‌ సాంగ్‌ చిత్రీకరణ ముగిసిన వెంటనే పోస్ట్‌ ప్రొడక్షన్‌ మొదలు కానున్నాయి. ప్రముఖ నిర్మాత అనిల్ సుంకర నిర్మాణ సారధ్యంలో ఈ మూవీని ఏప్రిల్ 25న విడుదల చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు.