వైసీపీ వైపు ఆకర్షితులవుతున్న ప్రజాప్రతినిధులు, తటస్థులు

ఎన్నికల వాతావరణం వేడెక్కుతున్నకొద్దీ రాష్ట్ర రాజకీయ సమీకరణాల్లో శరవేగంగా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ప్రజాభీష్టం స్పష్టమవుతుండడంతో సీనియర్‌ రాజకీయ నేతలతో పాటు తటస్థులు తమ భవిష్యత్‌ రాజకీయ కార్యాచరణకు ఉపక్రమిస్తున్నారు.

చీరాల టీడీపీ టికెట్ ఎవరికి ?

People Are Atrracted to Ycpరాష్ట్రంలో రాజకీయ వాతావరణం వైఎస్సార్‌ కాంగ్రెస్‌కు అనుకూలంగా మారుతుండడంతో అందుకనుగుణంగానే సమీకరణాలు వేగం పుంజుకుంటున్నాయి. అన్ని ప్రాంతాల సామాజికవర్గాల నేతలు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వాన్ని బలపరుస్తూ వైసీపీ లో చేరుతున్నారు.

వారిలో సీనియర్‌ నేతలు, కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా ఉన్నవారు, తొలిసారి రాజకీయాల్లో ప్రవేశిస్తున్న తటస్థులూ ఉండటం గమనార్హం.

ఉదాహరణకు..కృష్ణా జిల్లాలో ఉన్న పారిశ్రామికవేత్త, టీడీపీ సీనియర్‌ నేత దాసరి జైరమేష్, ఆయన సోదరుడు మాజీ ఎమ్మెల్యే బాలవర్థనరావు ప్రజాభీష్టాన్ని గుర్తించి వైఎస్సార్‌సీపీలో చేరారు.  సీఎం చంద్రబాబు సమీప బంధువు, జూ.ఎన్టీఆర్‌ మామ నార్నే శ్రీనివాసరావు కూడా చేరారు.

రాష్ట్రంలో రాజకీయంగా గుర్తింపు ఉన్న దగ్గుబాటి కుటుంబ వారసుడు దగ్గుబాటి హితేష్‌ చెంచురామ్‌ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ నుంచే రాజకీయ అరంగేట్రం చేశారు.అధికార పార్టీలో ఎంపీలుగా, ఎమ్మెల్యేలుగా ఉన్నవారు సైతం తమ పదవులను వదలుకుని మరీ వైఎస్‌ జగన్‌ నాయకత్వాన్ని బలపరుస్తున్నారు.

Advertisement