ప్రజా నాయకుడు ఎవరు?

People Like Which Leaderఏపీలో ఎన్నికలకు ఇక మూడున్నర నెలల సమయం మాత్రమే ఉంది.దీంతో నేతలు ఎవరు వ్యూహాల్లో వారున్నారు.ప్రతిపక్ష నేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి నిన్నటితో పాదయాత్రను ముగించారు.

ఏపీలో జనరల్ సర్వే.. గెలుపెవరిది?

ఇకనైనా ఆయన విశ్రాంతి తీసుకుంటారా? అంటే లేనట్టే కనిపిస్తుంది.ఈరోజు తిరుపతి వెళ్ళి వెంకన్న స్వామిని దర్శనం చేసుకొని,అనంతరం ఇడుపులపాయ వెళ్లనున్నారు.

ఆ తరువాత ఆయన అమరావతికి మకాం మార్చి రాజకీయాలు ఇక్కడనుండే నడిపించనున్నారు.ఒక్కొక్క నియోజకవర్గానికి బస్సులో వెళ్లి అభ్యర్థితో కలిసి ఆయన ప్రచారం చేయనున్నాడని సమాచారం.

ఇక ఏపీ సీఎం చంద్రబాబు గురించి చెప్పాలంటే ,ఆయనకు పొత్తుల కోసం వెంపర్లాడటానికే సమయం దొరకట్లేదు.అలాంటిది ప్రజల కోసం ఆలోచించే సమయం ప్రస్తుతం ఆయనకు ఉన్నట్టు లేదు.

ఇదంతా గమనిస్తున్న ప్రజలు రానున్న ఏపీ ఎన్నికలలో పక్షపాతం లేకుండా తమ సమస్యలు ఎవరు తీర్చగలరో వారినే ఎన్నుకోవాలని వారు అభిప్రాయపడుతున్నారు.

Advertisement