ఏపీకి ప్ర‌త్యేక‌హోదా పై అడ్డంగా బుక్కైన బాబు

ఇటీవ‌ల‌ ఢిల్లీలో ఏపీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత‌ చంద్రబాబు, ఆంధ్రప్రదేశ్ కు ఇచ్చిన హామీలను అమలుపర్చని కేంద్ర ప్రభుత్వ విధానానికి వ్యతిరేకంగా ఒక రోజు దీక్ష చేసిన సంగ‌తి తెలిసిందే.
ఈ క్ర‌మంలో బాబు దీక్ష‌కు కాంగ్రెస్ పార్టీ కూడా మ‌ద్ద‌తు పలికింది.

అట్టర్ ప్లాప్ అయిన బాబు సినిమా

అయితే నాడు ఏపీకి ప్ర‌త్యేక‌హోదా సంజీవ‌ని కాద‌ని, ప్ర‌త్యేక ప్యాకేజీ అంత‌కుమించి ఉంటుంద‌ని, ఇక‌ ముందు ఎవ‌రైన ప్ర‌త్యేక‌హోదా అంటూ ఆందోళ‌ణ‌లు, ధ‌ర్నాలు చేస్తే జైల్లో పెడ‌తామ‌ని బాబు ప్ర‌క‌టించ‌డ‌మే కాకుండా కొంత‌మంది పై కేసులు కూడా పెట్టారు.

తాజాగా వైసీపీ ఎంపీ విజ‌య‌సాయి రెడ్డి రాజ్య‌స‌భలో ప్ర‌త్యేక‌హోదా ఎందుకు ఇవ్వ‌డంలేద‌ని ప్ర‌శ్నించగా.. దీంతో స్పందించిన కేంద్ర‌మంత్రి పీయూష్ గోయ‌ల్ మంగళవారం రాతపూర్వక సమాధానం ఇచ్చారు.
14వ ఆర్థిక సంఘం సిఫారసుల అనంతరం ప్రత్యేక హోదా ఉనికిలో లేదు.

ఏపీ పునర్వ్యవస్థీకరణలో నిబంధనల మేరకు నీతి ఆయోగ్‌ ఏపీ అభివృద్ధికి నివేదిక సమర్పించింది. ఈ సిఫారసుల మేరకు ప్రత్యేక హోదాకు దీటుగా ప్రత్యేక ప్యాకేజీని కేంద్ర కేబినెట్‌ ఆమోదించింది.
2016, అక్టోబర్‌ 24న సీఎం చంద్రబాబు లేఖ ద్వారా ప్యాకేజీని సమ్మతించారు.

తదుపరి కేంద్ర కేబినెట్‌ దీనికి ఆమోదం తెలిపిన సందర్భంలోనూ 2017, మే 2న కృతజ్ఞతలు చెబుతూ లేఖ రాశారు.

కానీ ఇప్పుడు ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌పడుతుండ‌డంతో చంద్ర‌బాబు మ‌ళ్ళీ ప్ర‌త్యేక‌హోదాని తెర‌పైకి తెచ్చారు. చంద్ర‌బాబు సిత్రాలు రోజురోజుకీ తారాస్థాయికి చేరుకుంటున్నాయని స‌ర్వ‌త్రా చ‌ర్చించుకుంటున్నారు.