ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయం:పోచారం

పోచారం శ్రీనివాస్ రెడ్డి తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గా ఎన్నికైన విషయం తెలిసిందే.అయితే తాజాగా ఈయన ప్రజల సమస్యలను పరిష్కరించడానికి కృషి చేద్దామని పిలుపునిచ్చారు.

జగన్ ని పరామర్శించిన సినీ నటుడు

పరస్పర విమర్శలకుపోకుండా,మనసులో ఎలాంటి దురాలోచనలు పెట్టుకోకుండా,అందరం కలిసి కట్టుగా ప్రజల యొక్క సమస్యలను పరిష్కరించేలా కృషి చేద్దామని సభ్యులందరికీ స్పీకర్ విజ్ఞప్తి చేశారు.

తనకి ఈ స్పీకర్ పదవి వరించడం ఒక గొప్ప అవకాశం గా భావిస్తున్నానని, తనకి ఈ అవకాశం రావడానికి కారణమైన వాళ్లందరికీ కూడా స్పీకర్ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.

ఈ సందర్భంగా మీడియా సమావేశంలో మాట్లాడిన స్పీకర్…’తెలంగాణ ప్రజలు మాపై నమ్మకం, విశ్వాసంతో ఇచ్చిన పదవులు ఇవి అన్నారు. ప్రజల ఆకాంక్షల మేరకు శాసనసభలో
మేం సరైన పద్దతిలో వ్యవహరించాలన్నారు.

సభా నియమ నిబంధనలకు అనుగుణంగా సభను నిర్వహిస్తాం. సభా గౌరవాన్ని కాపాడేలా అన్ని పక్షాలు నాకు సహకరిస్తాయని భావిస్తున్నా. మంచి సలహాలు, సూచనలను నేను స్వీకరిస్తాను. సభా గౌరవం, హుందాతనంతో గౌరవప్రదంగా నడుపుదాం.’అని తెలిపారు. 

Advertisement