ఆ ఒక్క సీటు వైసీపీ గెలిస్తే.,విజయం వైసీపీదే!

Political Centimentఔను నిజమే అక్కడ టీడీపీ ఓడిందంటే, ఇక రాష్ట్రంలో టీడీపీ పని అయిపోయినట్టే, జగన్ సీఎం అయినట్టే.అదే గుంటూరు జిల్లాలోని సత్తెనపల్లి నియోజకవర్గం.

జగన్ కి కోపం తెప్పిస్తే ఇలానే ఉంటదా?

అదేంటి ఆ ఒక్క సీట్లో ఓడితే ఏమవుతుంది అంటారా? అదే మరి సెంటిమెంట్ అంటే.ఎన్నికలు అనగానే రాజకీయ పార్టీ నాయకులు రకరకాల సెంటిమెంట్లను తెరపైకి తెస్తుంటారు.

ఒకసారి పరిశీలిస్తే ,1983లో టీడీపీ అభ్యర్థిగా నన్నపనేని రాజకుమారి గెలిచారు.అప్పుడు టీడీపీకే అధికారం దక్కింది.ఆ తరువాత 1989లో టీడీపీ మద్దతిచ్చిన సీపీఎం అభ్యర్ధి ఓడిపోయారు.దాంతో తెలుగుదేశం అధికారానికి దూరమైంది. 1994లో వామపక్ష అభ్యర్థి గెలిచారు. మళ్లీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది.

1999లో వైవీ ఆంజనేయులు గెలిచారు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి ఎర్రం వెంకటేశ్వర్ రెడ్డి గెలిచారు. ఆ రెండు సార్లు టీడీపీకి అధికారం దక్కలేదు.

2014లో కోడెల గెలిచారు. మళ్లీ తెలుగుదేశం అధికారం చేజిక్కించుకుంది. మరి ఇప్పుడు ఒప్పుకుంటారా?, ఇక్కడ టీడీపీ ఓడితే కాబోయే సీఎం జగనే అని.