పవన్‌కళ్యాణ్‌కు పోసాని కృష్ణమురళీ సవాల్‌

ప్రముఖ సినీనటుడు, దర్శకుడు పోసాని కృష్ణమురళీ తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్రవాళ్లని కొడుతున్నారని చెబుతున్న పవన్‌కళ్యాణ్‌ ఎవరెవర్ని కొట్టారో చెప్పాలని సవాల్‌ చేశారు.

ఏపీ ప్రభుత్వ క్యాష్ ఫర్ ట్వీట్‌:కేటీఆర్‌

ఆంధ్రులపై దాడులు జరుగుతుంటే వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి భుజాలకెత్తుకుంటున్నారని ఆంధ్రజ్యోతి పలుకులనే పవన్‌కళ్యాణ్‌ పలికారని విమర్శించారు.

‘గతంలో పవన్‌ ఎవరిని భుజాలకెత్తుకున్నారో ప్రజలకు తెలుసని సంబంధిత వీడియోలను చూపించారు.సీఎం కూతురు కవిత గురించి మాట్లాడుతూ… బంగారు చెల్లీ వేల వేల అభినందనలు, హ్యాప్పీ బర్త్‌డే అంటూ ట్వీట్‌లు చేసింది మీరు కాదా అని ప్రశ్నించారు.

కేసీఆర్‌ భూములను ఆక్రమించారని అంటున్నావు ఎక్కడైనా ఆంధ్రావారి భూములు లాక్కున్నట్లు చూపిస్తే పాదాభివందనం చేస్తానని పోసాని సవాల్‌చేశారు.

తెలంగాణ రాష్ట్రంలో నీ ఆస్తులు, మీ అన్న ఆస్తులు ఉన్నాయి కదా.. ఏనాడైనా మిమ్మల్ని బెదిరించారా’ అని పోసాని ప్రశ్నించారు.