‘పడి పడి లేచే మనసు’ మూవీ రివ్యూ:కొంచెం కొత్తగా

PPLM Movie Review

‘పడి పడి లేచే మనసు’ మూవీ రివ్యూ రేటింగ్:3.0/5.0

టైటిల్ : పడి పడి లేచె మనసు

జానర్ : రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌

తారాగణం : శర్వానంద్‌, సాయి పల్లవి, మురళీశర్మ, సుహాసిని

సంగీతం : విశాల్‌ చంద్రశేఖర్‌

దర్శకత్వం : హను రాఘవపూడి

నిర్మాత : ప్రసాద్‌ చుక్కపల్లి, సుధాకర్‌ చెరుకూరి

ట్రైలర్:ప్రేమలో పడితే లేవలేరంటున్న శర్వా!

హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై మొదటి నుండి అంచనాలు భారీగానే ఉన్నాయి.ప్రస్తుతం తెలుగు పరిశ్రమలో మంచి ఫామ్ లో వున్న శర్వానంద్ – ఫిదా బ్యూటీ సాయిపల్లవికున్న క్రేజ్ ఈ సినిమాకు ప్లస్ కానున్నాయి.అయితే ఈ రోజు విడుదలైన ‘పడి పడి లేచే మనసు’ ప్రేక్షకులను ఆకట్టుకుందా?.

కథ :

సినిమా కథ నేపాల్ లో మొదలవుతుంది.శర్వానంద్ (సూర్య ) తన ప్రేమ కథను చెప్పడం మొదలుపెడతాడు.మొదటిసారి తను సాయి పల్లవిని (వైశాలి) కలకత్తాలో చూస్తాడు.చూడగానే వైశాలి ప్రేమలో పడిపోతాడు.వైశాలి మెడికల్ స్టూడెంట్,ఆమెను ప్రేమిస్తూ ఆమె వెనకే తిరుగుతుంటాడు.సూర్య ప్రేమలో వైశాలి కూడా పడిపోతుంది.తరువాత సూర్య తన గతం తాలూకు సమస్యలు వైశాలిని వెంటాడుతాయేమోనని,పెళ్లి చేసుకోవద్దు ఇలానే ఉండిపోదాం అని వైశాలి తో చెప్తాడు.దాంతో వైశాలి సూర్యతో విడిపోతుంది.మళ్ళీ సూర్య-వైశాలి ఎలా కలవనున్నారు?ఈ ప్రయాణంలో వాళ్లకు ఎదురైనా ఇబ్బందులేంటి ? తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

నటీనటులు :

శర్వానంద్ తన నటనతో మరోసారి అభిమానుల మనసును దోచుకున్నాడు.అలాగే సాయి పల్లవి తన పాత్రలో జీవించింది.సినిమా మొత్తం వీరిద్దరి చుట్టూ తిరుగుతుంది.వీరిద్దరూ తమ పాత్రలకు నాచురల్ నటనతో ప్రాణం పోశారు.ఇక వెన్నెల కిశోరె ,సునీల్ ,ప్రియదర్శి వాళ్ళ టైమింగ్స్ లో హాస్యాన్ని అద్భుతంగా పండించారు.మురళి శర్మ, ప్రియా రామన్‌ తమ పాత్రల పరిది మేరకు ఆకట్టుకున్నారు.

విశ్లేషణ :

హను రాఘవపుడి ఈ ప్రేమ కథను తనదైన శైలిలో తెరకెక్కించారు.మొదటి భాగం హీరో హీరోయిన్ల కెమిస్ట్రీ, కామెడీ, సాంగ్స్‌ ఇలా ఆసక్తిగానే సాగింది.కాకపోతే హీరో హీరోయిన్లు విడిపోయే కారణం కాస్త కన్వెన్సింగ్ గా అనిపించలేదు.రెండవ భాగం రొటీన్ గా సాగిపోతూ,కథలో కొత్తదనం కనిపించలేదు.అలాగే క్లైమాక్స్ సన్నివేశాలు కూడా త్వరత్వరగా ముగించాడని అనిపిస్తుంది.మొత్తానికి మొదటి భాగం మీద ద్రుష్టి పెట్టినట్టు రెండవ భాగం మీద పెట్టలేదని తెలుస్తుంది.విశాల్ చంద్రశేఖర్‌ తన సంగీతంతో మ్యాజిక్‌ చేశాడనే చెప్పాలి. పాటలతో పాటు నేపథ్య సంగీతం కూడా కట్టిపడేస్తుంది. సినిమాటోగ్రఫి, ఆర్ట్‌ సూపర్బ్‌ అనిపించేలా ఉన్నాయి. కొన్ని ఫ్రేమ్స్‌ మణిరత్నం సినిమాలను గుర్తు చేస్తాయి. ఎడిటింగ్‌, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.