మరో సారి రచ్చకెక్కిన టీడీపీ వర్గపోరు

Prabhakar chowdhary fires on JCఅనంతపురం జిల్లాలో ప్రారంభానికి సిద్దంగా ఉన్న రాంనగర్‌ బ్రిడ్జి విషయంలో జిల్లాలో టీడీపీ నాయకులు ఎంపీ జేసీ దివాకర్‌ రెడ్డితో స్థానిక ఎమ్మెల్యే ప్రభాకర్‌ చౌదరి మధ్య వివాదం నెలకొంది.

చింతమనేనికి చెక్ పెడుతున్న వైసీపీ నేత

ఈ బ్రిడ్జిని ప్రారంభించేందుకు జేసీ సిద్దమవుతున్నారని ప్రభాకర్‌ చౌదరి అనుమానిస్తున్న నేపథ్యంలో జేసీపై ఘాటు వ్యాఖ్యలు చేశారు.

అనంతపురం లలితా కళా పరిషత్‌లో జరిగిన బీసీ సదస్సులో ప్రభాకర్‌ చౌదరి మీడియాతో మాట్లాడుతూ..
రాంనగర్‌ ఫ్లై ఓవర్‌ బ్రిడ్జి ప్రారంభానికి జేసీ సిద్ధమవ్వడం హాస్యాస్పదంగా ఉందన్నారు.

కాంట్రాక్టర్‌గా పనులు చేసినంత మాత్రానా అన్నిహక్కులు వస్తాయా ? అని ఘాటుగా ప్రశ్నించారు.
పీస్‌ మెమొరియల్‌ హాల్‌కు దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌ పేరు పెడితే జేసీ దివాకర్‌ రెడ్డికి ఎందుకంత కడుపు మంట? అని ఫైర్‌ అయ్యారు.

జేసీ దివాకర్‌ రెడ్డి అక్రమాల చిట్టా తన వద్ద ఉందని హెచ్చరించారు.తన ఓపికను పరీక్షించొద్దని జేసీ పై సీఎం చంద్రబాబుకు ఫిర్యాదు చేస్తానని స్పష్టం చేశారు.

Advertisement