ప్రభాస్ 21 సినిమా సుకుమార్ తో నట!

ప్రస్తుతం ప్రభాస్ ‘సాహో’ సినిమాతో పాటు,జిల్ ఫేమ్ రాధాకృష్ణతో నటిస్తున్న విషయం తెలిసిందే.ఈ రెండు సినిమాలు కూడా భారీ బడ్జెట్ తో,యు.వి.క్రియేషన్స్ నిర్మాతలే తెరకెక్కిస్తున్నారు.ఇప్పటికే ఈ సినిమాలపై భీభత్సమైన అంచనాలు నెలకొన్నాయి.ఇటీవల విడుదలైన ‘సాహో చాప్టర్ 1’ తో అందరి చూపు తమ వైపుకు తిప్పుకున్నారు.ఈ రెండు సినిమాలు వేసవిలో విడుదల చేయాలని పూర్తి సన్నాహాలు చేస్తున్నారు.

తనకు తానే పోటీ అంటున్న ప్రభాస్

Sukumar Clarity on Prabhas Movieతాజాగా వచ్చిన సమాచారం ప్రకారం దర్శకుడు సుకుమార్ ప్రభాస్ 21 వ సినిమాను చేయనున్నారట.ప్రస్తుతం ప్రభాస్ సినిమాకు స్క్రిప్ట్ ను తయారు చేసే పనిలో ఉన్నారట.ప్రభాస్ రెండు సినిమాలు పూర్తయ్యే సరికి స్క్రిప్ట్ తో సుక్కు రెడీగా ఉంటారట.ఇప్పటికే రంగస్థలం విజయంతో సుకుమార్ మంచి ఫామ్ లో ఉన్నారు.

ప్రభాస్ కు ఇంటర్నేషనల్ లెవెల్ లో గుర్తింపు ఉన్న సంగతి తెలిసిందే.ఇప్పుడు ప్రభాస్ చేయబోయే ప్రతి సినిమా ఆచితూచి చెయ్యాల్సి ఉంది.ఇక తెలుగు పరిశ్రమలో ఇంటిలిజెంట్ దర్శకుడని పేరు తెచ్చుకున్న సుకుమార్ ఎలాంటి కథతో రాబోతున్నాడో చూడాలి మరి.