అఖిల్ సరసన ట్యాక్సీవాలా హీరోయిన్ ?

వరుస ప్లాప్స్ తో ఇబ్బంది పడుతున్న అక్కినేని అఖిల్ తన నాలుగో చిత్రం బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్ లో ఓ సినిమా చేయబోతున్నాడనే సంగతి తెలిసిందే.ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ 2 పతాకం పై బన్నీ వాసు నిర్మించనున్నారు.

మజ్ను కోసం యంగ్ టైగర్ ఎన్టీఆర్

ప్రస్తుతం ప్రీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ మూవీ లో అఖిల్ కు జోడిగా అనంతపూరం బ్యూటీ ప్రియాంక జవాల్కర్ ను ఎంపిక చేసినట్లు సమాచారం. త్వరలోనే ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లనుంది.

‘ట్యాక్సీవాలా’ చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ప్రియాంక మొదటి సినిమాతో మంచి సక్సెస్ ని తీసుకొచ్చింది .ప్రస్తుతం ఈ భామ రవితేజ హీరోగా నటిస్తున్న డిస్కోరాజా చిత్రంలో నటిస్తుందనే వార్తలు వినిపిస్తున్నాయి.అయితే ఈ చిత్రానికి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

Advertisement