వైసీపీ అభ్యర్థుల పేర్లతో బరిలోకి దిగిన పాల్ పార్టీ అభ్యర్థులు

ఎన్నికల సమయం దగ్గర పడటంతో వైసీపీ పార్టీ పై ప్రజాశాంతి పార్టీ తన జిమిక్కులను చూపిస్తుంది.ఇప్పటికే వైసీపీ ది మరియు ప్రజాశాంతి పార్టీ ల ఎన్నికల గుర్తులు దాదాపు సమానంగానే ఉండడంతో వైసీపీ నాయకులూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

వీడీపీ అసోసియేట్స్ సర్వే:వైసీపీదే గెలుపు

 ఇప్పుడు వైసీపీ అభ్యర్థులను పోలిన పేర్లతోనే ప్రజాశాంతి పార్టీ అభ్యర్థులు రంగంలోకి దిగడం ఏపీలో సంచలనం రేపుతోంది. ఏపీలో 35 అసెంబ్లీ, 4 పార్లమెంట్ సెగ్మెంట్లలో ప్రజాశాంతి అభ్యర్థుల పేర్లు వైసీపీ అభ్యర్థుల పేర్లు సమానంగానే ఉన్నాయి.

ఈ సంఘటనతో ఆందోళన చెందుతున్న కొందరు వైసీపీ నేతలు అభ్యన్తరం వ్యక్తం చేసి ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ సంఘటన పై ప్రజాశాంతి పార్టీ అద్యక్ష్యుడు కేఏ పాల్ ఒక ప్రైవేట్ ఛానల్ కి ఒక సంబంధంలేని వివరణ ఇవ్వడం గమనార్హం. psp candidates under the names of the ycp candidates