‘యాత్ర’ సినిమాపై రాఘవేంద్ర రావు వ్యాఖ్యలు!

Ragha vendra Rao about yatraదివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘యాత్ర’. మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి, దాదాపు రెండు దశాబ్ధాల అనంతరం చేసిన తెలుగు సినిమా ‘యాత్ర’.

రాటుతేలిన జగన్ రాజకీయం.. యుద్దానికి సిద్ధమా?

ఈ చిత్రం విడుదలయిన అన్ని సెంటర్లలోను హిట్ టాక్ తెచ్చుకోవడమే కాదు, రాజకీయాలకు అతీతంగా జనాలు ఈ చిత్రాన్ని మెచ్చుకుంటున్నారు.ఇప్పటికే ఈ సినిమాపై పలువురు రాజకీయ నేతలు,సినీ ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు.

తాజగా ఈ చిత్రంపై రాఘవేంద్రరావు స్పందించారు.ఈ సినిమా చూసిన తరువాత తన ఫేస్ బుక్ ఖాతాలో , ‘యాత్ర చూశాను, దర్శకుడు మహి వ్ రాఘవ రాజశేఖర్ రెడ్డి గారి పాదయాత్రతో పాటు, ఆయన ఆశయాల్ని కూడా అద్భుతంగా తెరకేక్కించాడు. మమ్ముట్టి ఆయన పాత్రలో జీవించారు. నిర్మాతలు విజయ్ మరియు శశి కి, వారి చిత్ర యూనిట్ కి నా కృతజ్ఞతలు’ అని వ్యాఖ్యానించారు.

Advertisement