‘#RRR’ మీట్ లో మహేష్ ప్రస్తావన..

Rajamouli about Mahesh Babuనిన్న జరిగిన ‘#RRR’ మీడియా మీట్ లో అనేక ఆసక్తికర ప్రశ్నలకు రాజమౌళి చాలా తెలివిగా సమాధానాలు ఇచ్చాడు.

‘మహర్షి’ విడుదల అప్పుడేనట!

ఒక మీడియా ప్రతినిధి రాజమౌళిని ప్రశ్నిస్తూ, గతంలో ‘అల్లూరి సీతారామరాజు’ సినిమా సూపర్ స్టార్ కృష్ణ చేశారు. మరీ ‘#RRR’ లో అల్లూరి పాత్రకు మహేష్ బాబును ఎందుకు తీసుకోలేదు అంటూ రాజమౌళిని ఇరుకున పెట్టడానికి ప్రయత్నించాడు.

అయితే ఈ ప్రశ్నకు రాజమౌళి చాల తెలివిగా సమాధానం ఇచాడు.గతంలో ఒక సినిమా ఫంక్షన్ లో పాల్గొన్నప్పుడు మహేష్ అభిమానులు కొందరు, తనను మహేష్ తో సినిమా ఎప్పుడు అని ప్రశ్నించిన విషయాన్ని గుర్తుకు చేసుకున్నాడు.

అప్పుడు తాను మహేష్ ను ‘అల్లూరి సీతారామరాజు’ గా చూపించనా లేదంటే జేమ్స్ బాండ్ గా చూపించనా అని అడిగినప్పుడు, మహేష్ అభిమానులు మహేష్ ను జేమ్స్ బాండ్ గా చూపించమని చెప్పిన విషయాలను బయటపెట్టాడు.

దీంతో ‘#RRR’ ప్రాజెక్ట్ లో మహేష్ ను ఎంపిక చేయకపోవడానికి గల కారణం, మహేష్ అభిమానులు మాత్రమే అన్న పరోక్ష సందేశాన్ని రాజమౌళి ఇచ్చాడు.అయితే అన్నీ అనుకున్నట్లుగా జరిగితే ఈ సినిమా తరువాత జక్కన్న మహేష్ తో సినిమా చేస్తాడన్న వార్తలు వస్తున్నాయి.