అభిమానులకు రాజమౌళి అవకాశం!

Rajamouli Offers to Fansసహజంగా సినిమా టైటిల్ ఒకటే ఉంటుంది. అది ఎన్ని భాషల్లో విడుదలైనా బాహుబలి విషయంలో ఇలాగే చేశారు.’#RRR’ విషయానికి వస్తే ఈ సినిమా ఇండియా అంతటా విడుదలవుతుండటంతో ఈ టైటిల్ అన్నింటికీ కామన్ గా ఉంటుందని ప్రకటించారు.

‘#RRR’ మీట్ లో మహేష్ ప్రస్తావన..

తాజాగా రాజామౌళి మా సినిమాకు పేరు మీరే పెట్టండి అని అభిమానులకు ఆఫర్ ఇచ్చాడు.ఇక రాజమౌళి అలా ఆఫర్ ఇచ్చారో లేదో నెటిజన్లు రెచ్చిపోతున్నారు.

‘#RRR’ టైటిల్‌కు కలిసివచ్చేలా పేర్లు సూచిస్తున్నారు. వాటిలో కొన్ని ఇలా ఉన్నాయి.రౌద్ర రణ రంగం, రం రం రుథిరం, రామ రావణ రాజ్యం, రఘుపతి రాఘవ రాజారాం ఇలా ఒక్కొక్కరు ఒకలా టైటిల్ పెడుతున్నారు.

మరి వీటిలో రాజమౌళి దేన్నైనా సెలక్ట్ చేసుకుంటారా లేదా ఆయన ఇప్పటికే అన్ని భాషల్లోనూ టైటిల్ ఫిక్స్ చేసుకునే ఉన్నారా అన్నది తెలియాల్సి ఉంది.